Site icon NTV Telugu

Dilsukhnagar Bomb Blast: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

Ts High

Ts High

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. NIA ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్ధించింది. పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురికి ఉరి శిక్ష సరైనదేనని సంచలన తీర్పునిచ్చింది. 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుళ్లలో 18 మంది మృతి, 130 మందికి గాయాలు అయ్యాయి. ఈ విషాద ఘటన నగర ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. 2016లో NIA ఫాస్ట్‌ట్రాక్‌కోర్టు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి ఉరిశిక్ష విధించింది. అయితే కింది కోర్టు తీర్పుపై ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధాన నిందితుడు రియాజ్‌భత్కల్ ఇప్పటికి పరారీలో ఉన్నాడు. ఈ జంట పేలుళ్లకు ప్రధాన కారకుడైన యాసిన్‌ భత్కల్‌ అని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Exit mobile version