Site icon NTV Telugu

TG High Court: గ్రూప్-1 పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని TGPSC కి హైకోర్టు ఆదేశం

Tgpsc

Tgpsc

గ్రూప్-1 పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గ్రూప్-1 పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు.. మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని టీజీపీఎస్సీకి ఆదేశం.. రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని TGPSCకి ఆదేశం.. సాధ్యంకాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలన్న హైకోర్టు.. మెయిన్స్ మెరిట్ లిస్ట్ ను హైకోర్టు రద్దు చేసింది.

Also Read:Allu Shock : అల్లు అరవింద్ కు GHMC షాక్.. కూల్చేస్తాం..

మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023 అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు 21 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ ఈ ఏడాది మార్చి 10న విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనేక అనుమానాలు తలెత్తాయి.

Also Read:Love Tragedy: వచ్చే జన్మలో అయినా నా బంగారు తల్లిని పెళ్లిచేసుకుంట.. ప్రియురాలి మృతిని తట్టుకోలేక ప్రియుడు..

పరీక్షల్లో జెల్‌ పెన్నులు వాడటం, కోఠి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది సెలెక్ట్‌ కావడం, తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపిక కావడం, కేవలం 2 సెంటర్ల నుంచే టాపర్లు ఉండటం తదితర అంశాలపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షలు రద్దు చేయొద్దని కోర్టులో పిటిషన్ వేసిన ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు. ఇప్పటికే ఇరువురి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం.. ఇవాళ తెలంగాణ హైకోర్టు మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని తుది తీర్పును వెల్లడించింది.

563 గ్రూప్ వన్ పోస్ట్ ల భర్తీకి నియామక పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్సీ..10th మార్చ్ న మార్క్స్ ను అభ్యర్థుల లాగిన్ ID లకు పంపించిన టీజీపీఎస్సీ.. వచ్చిన మార్క్ ల పై అభ్యంతరాలు ఉంటే రికౌంటింగ్ కి అవకాశం ఇచ్చిన సర్వీస్ కమిషన్.. మార్చి 24 వరకు రీ కౌంటింగ్ కు అవకాశం ఇచ్చిన సర్వీస్ కమిషన్.. ఈ ఏడాది మార్చి 30న జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేసిన సర్వీస్ కమిషన్.

Exit mobile version