Site icon NTV Telugu

Medchal Fertility Scam: మేడ్చల్ కమర్షియల్ సరోగసి కేసులో సంచలన విషయాలు.. రూమ్ లను బ్యాచిలర్స్ కి మాత్రమే అద్దెకిస్తూ..

Medchal Fertility Scam

Medchal Fertility Scam

మేడ్చల్ కమర్షియల్ సరోగసి కేసులో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. ఏపీ చిలకలూరిపేట కి చెందిన లక్ష్మీ రెడ్డి పై 2024 లో ముంబై లో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు నమోదైంది. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ చేరుకున్న లక్ష్మీ రెడ్డి.. కొడుకు నరేందర్ రెడ్డి, కూతురు తో కలిసి మరో దందాకు తెరలేపింది. మాదాపూర్, అమీర్‌పేట, RTC x రోడ్ ప్రాంతాల్లో ఉన్న ఫర్టిలిటీ సెంటర్ల తో పరిచయాలు ఏర్పర్చుకుంది. అండాలు కావాలన్నా.. సరోగసి కోసం మహిళలు కావాలన్నా ఆరెంజ్ చేస్తామని.. ఏజెంట్లుగా పని చేశారు తల్లి, కొడుకు.

Also Read:Rao Bahadur : రాజమౌళి చేతుల మీదుగా.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్!

మూడు సార్లు అండాలు ఇస్తే 30 వేల రూపాయలు ఇస్తానని, సరోగసి ద్వారా పిల్లలను కనిస్తే 4 లక్షలు ఇస్తానని లక్ష్మీ రెడ్డి ఆశ చూపింది. తన ఇంటి ఫస్ట్ ఫ్లోర్ లో రూమ్ లను కేవలం బ్యాచిలర్స్ కి మాత్రమే అద్దెకిస్తోంది. అద్దెకి ఉంటున్న యువకుల నుంచి వీర్యం సేకరించినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీ రెడ్డి 6 హాస్పిటల్స్ కు ఏజెంట్ గా ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు 50 మంది మహిళలతో సరోగసి చేయించినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు.. దీనికోసం ఒక నోట్ బుక్, డైరీ మెయింటెయిన్ చేస్తోంది లక్ష్మీ రెడ్డి.

Also Read:High Interest: అధిక వడ్డీ ఆశ చూపి.. రూ. 20 కోట్లు కాజేసిన కేటుగాడు.. విడాకులకు అప్లై చేసిన భార్య

సరోగసి ద్వారా బిడ్డలను కని ఇచ్చిన మహిళల లిస్ట్, వాళ్లకు ఇచ్చిన డబ్బుల వివరాలు డైరీలో నోట్ చేస్తున్నట్లు గుర్తించారు. కర్ణాటక కి చెందిన మహిళ భర్త ఫిర్యాదు తో లక్ష్మీ రెడ్డి బాగోతం బయటపడింది. కర్ణాటక కి చెందిన మహిళకు రెండు కిడ్నీలు పాడైన విషయం తెలుసుకున్న లక్ష్మీ రెడ్డి.. కిడ్నీ ఆపరేషన్ కి కావాల్సిన డబ్బులు తాను ఇస్తాను అని.. ఆరోగ్యం కుదుటపడ్డాక సరోగసి ద్వారా తనకు బిడ్డను కని ఇవ్వాలని బేరం కుదుర్చుకుంది. ఆమె ఒప్పుకోవడంతో ఆపరేషన్ కి కావాల్సిన డబ్బులు ఇచ్చింది. ఆపరేషన్ తర్వాత ఆరోగ్యం కుదుటపడటంతో సరోగసి కోసం మహిళను సంప్రదించింది. ఈ క్రమంలో ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది.

Also Read:Indie Dog Puppy Adoption: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో.. జలగం వెంగళరావు పార్క్ లో దేశీ కుక్క పిల్లల దత్తత మేళా..

దీంతో గొడవ జరిగింది. అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాను ఒప్పందం చేసుకున్న మహిళలకు హిందీ భాష నేర్పించింది లక్ష్మీ రెడ్డి. ముఖ్యంగా నార్త్ ఇండియాకి చెందిన దంపతులు ఎక్కువగా సరోగసి కోసం వస్తుండటంతో.. అద్దె గర్భానికి ఒప్పుకున్న మహిళ కూడా నార్త్ ఇండియా కి చెందిన మహిళే అని నమ్మించే ప్రయత్నం చేసింది. తన సంరక్షణ లో ఉన్న మహిళలకు ఇంట్లోనే హిందీ ఎలా మాట్లాడాలో లక్ష్మీరెడ్డి శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version