NTV Telugu Site icon

Swami Paripoornananda: ఏపీ ఫలితాలపై పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు..వైసీపీకి 123 సీట్లు ఖాయం!

New Project (21)

New Project (21)

ఎన్నికల ఫలితాలప్తె పరిపూర్ణానంద స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపడుతుందని అభిప్రాయపడ్డారు. మూడోసారి మోడీ ప్రధాని అవుతారని నొక్కి చెప్పారు. ఏపీ ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ123 స్థానాలు సాధిస్తుందని.. రెండోసారి జగన్ సీఎం అవుతారన్నారు. ముఖ్యమైన వ్యక్తి ద్వారా అందిన సమాచారం మేరకే చెబుతున్నానని.. హిందూపురంలో ఊహించని పరిణామం చూడబోతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు అధిక శాతం వైసీపీకే ఓట్లు వేశారని చెప్పారు. కాగా.. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ను పలువురు నాయకులు కొట్టిపారేశారు. కొన్ని సర్వేలు వైసీపీకి జై కొట్టగా.. మరి కొన్ని సర్వేలు కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. రాష్ట్రంలో ఆయా పార్టీల నాయకులు మాత్రం తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని గంటల్లో ఏపీ భవితవ్యం తేలనుండగా.. పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

READ MORE: UP: కదులుతున్న సీఎన్ జీ కారులో మంటలు.. నలుగురు సజీవ దహనం

కాగా.. హీరో నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక గురువు, శ్రీ పీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. హిందూపురం నుంచి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో బాలయ్య ఇక్కడి నుంచి బరిలో నిలిచారు. ఇక వైసీపీ నుంచి టీఎన్ దీపిక బరిలో నిలిచారు. అయితే బీజేపీ నుంచి ఎన్నికల బరిలో నిలవాలని పరిపూర్ణానంద భావించారు. కానీ పొత్తులో ఈ సీటు టీడీపీకీ వెళ్లటంతో నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో అసంతృప్తికి గురైన స్వామి పరిపూర్ణానంద స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మరి కొన్ని గంటల్లో వారి భవితవ్యం తేలనుంది.