NTV Telugu Site icon

Etela Rajender: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు.. చనిపోయిన బిడ్డకు ట్రీట్మెంట్ ఇచ్చారు

Etela Rajender: హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతి మరణానికి కారణం వేధింపులేనన్నారు. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. చైతన్యాన్ని చంపేస్తే ఉన్మాదం వస్తుందన్నారు. మనం ప్రోగ్రెసివ్ మానర్ లో ఉన్నామా? రిగ్రసివ్ మేనర్లో ఉన్నామా ? అంటూ వ్యాఖ్యానించారు. అసైన్డ్ భూములు తీసుకుంటే మార్కెట్ ధర ప్రకారం వారికి నష్టపరిహారం చెల్లించాలని ఈట‌ల గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్క ఎస్టీ అధికారిగానీ, ఒక్క ఎస్సీ అధికారి గానీ లేర‌ని ఈట‌ల రాజేంద‌ర్ గుర్తుచేశారు.

Read Also: Pakistan: పాకిస్తాన్‌లో మహిళల పరిస్థితి ఇది.. మహిళా దినోత్సవం రోజున ర్యాలీకి అనుమతి నిరాకరణ

అసెంబ్లీలో ఒక్క దళిత మహిళ ఎమ్మెల్యే లేరని ఈటల రాజేంద‌ర్ ఆవేద‌న వ్యక్తం చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన ఓ స‌మావేశంలో చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా జ‌స్టిస్ చంద్రచూద్ చేసిన వ్యాఖ్యలను ఈట‌ల గుర్తుచేశారు. ఉన్నత విద్య చ‌దువుతున్న విద్యార్ధుల్లో 1000 మంది మ‌ధ్యలోనే చ‌దువు వ‌దిలేసి వెళ్లిపోతున్నార‌ని, 500 మంది చ‌నిపోతున్నార‌ని చంద్రచూద్ తెలిపారు. మెడిక‌ల్ స్టూడెంట్ ప్రీతి మ‌ర‌ణంపై కూడా ఈటెల రాజేంద‌ర్ ప‌లు వ్యాఖ్యలు చేశారు. ప్రీతి మ‌ర‌ణానికి వేధింపులే కార‌ణ‌మ‌ని అన్నారు. చ‌నిపోయిన ప్రీతికి చికిత్స చేశార‌ని ఈటెల ఆరోపించారు.

Read Also: Vada pav: “వడాపావ్”కు అరుదైన గుర్తింపు.. బెస్ట్ శాండ్‌విచ్‌ల జాబితాలో చోటు..

Show comments