NTV Telugu Site icon

Raging In Collage: ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా విద్యార్థి నిరసన చేయడంతో.. జూనియర్‭ను చితకొట్టిన సీనియర్లు

Ragging

Ragging

Raging In Collage: నోయిడాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీ క్యాంపస్‌లో జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ దాడి ఘటన వెలుగు చూసింది. అందిన సమాచారం ప్రకారం.. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా జూనియర్ విద్యార్థులు నిరసన తెలపడంతో సీనియర్లు వారిని కొట్టారు. బాధిత విద్యార్థి సెక్టార్ -39 పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో భాగంగా గత నెలలో రాత్రి 3 గంటల సమయంలో కొంతమంది సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేసి కొట్టారని ఆరోపించారు. ఫిర్యాదు ప్రకారం విద్యార్థి ఆదర్శ్ త్రిపాఠి, అతని సహవిద్యార్థులు వారి గదుల్లో ఉండగా.. కొంతమంది సీనియర్లు అకస్మాత్తుగా గదిలోకి వచ్చారు. ఆ తర్వాత సీనియర్లు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేయడం ప్రారంభించారు. బాధిత విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం.. దీనిపై తాను నిరసన తెలపడంతో సీనియర్లు తనను దుర్భాషలాడి దారుణంగా కొట్టారని అన్నాడు. ఈ క్రమంలో బాధిత విద్యార్థికి ఒక పన్ను విరిగి తీవ్ర గాయాలయ్యాయి.

Read Also: IND vs SA: ఆధిక్యం ఎవరు సాధిస్తారో? టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సీనియర్లు జూనియర్ విద్యార్థులను దుర్భాషలాడుతూ కొట్టారు. తనకు చాలా భయంగా ఉందని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే, యూనివర్శిటీ క్యాంపస్‌లో వైరల్‌గా మారిన వీడియో నెలరోజుల నాటిదని నోయిడా పోలీసులు తెలిపారు. వీడియోలో కనిపిస్తున్న సీనియర్ విద్యార్థులపై యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఈ కేసును మళ్లీ విచారిస్తున్నామని, బాధిత విద్యార్థిని వాంగ్మూలం ఆధారంగా తదుపరి చట్టపరమైన ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ఈ ఘటనపై యూనివర్సిటీ యంత్రాంగం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఈ వీడియోపై సమాచారం అందుకున్న యూనివర్సిటీ వెంటనే చర్యలు చేపట్టింది.