NTV Telugu Site icon

CM Secretary: సీఎం చంద్రబాబు సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ రాజమౌళి

Ias Rajamouli

Ias Rajamouli

CM Secretary: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్‌ రాజమౌళి నియమితులయ్యారు. ఇటీవల కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయిన సీనియర్ ఐఏఎస్ రాజమౌళి ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఆయన రిపోర్ట్‌ చేసిన వెంటనే ముఖ్యమంత్రి కార్యదర్శిగా పోస్టింగ్ లభించింది. ఏపీకి చెందిన రాజమౌళి 2003 బ్యాచ్‌కు చెందిన ఉత్తరప్రదేశ్ క్యాడర్ అధికారి. టీడీపీ ప్రభుత్వంలో 2015-19 మధ్య ముఖ్యమంత్రి కార్యదర్శిగా సీఎం కార్యాలయంలో పని చేశారు. ప్రస్తుతం యూపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Read Also: AP Weather: ఏపీకి భారీ వర్ష సూచన.. ఏలూరు, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్

Show comments