Site icon NTV Telugu

Khushbu: నటి ఖుష్బూ ఇంట విషాదం !

Kusbhoo

Kusbhoo

Khushbu: ఈ ఏడాది సినీ ఇండస్ట్రీని విషాదాలు వెంటాడుతున్నాయి. సినీ పరిశ్రమకు పెద్ద దిక్కులాంటి వారు ఈ సంవత్సరంలోనే కన్నుమూశారు. కృష్ణ, కృష్ణంరాజు లాంటి వారి మరణంతో ప్రభాస్, మహేష్ బాబు వంటి హీరోలు తమ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన బాధలో ఉన్నారు. ఈ మరణ వార్తలను మరిచిపోక ముందే సీనియర్ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ ఇంట విషాదం నెలకొంది. ఆమె అన్నయ్య ఇవాళ మృతి చెందారు. ఈ విషాదకర వార్తను ఆమె ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఖుష్బూ 1970లో సెప్టెంబర్ 29న ముంబైలోని అంధేరిలో జన్మించారు. అసలు పేరు నఖత్ ఖాన్. ఈమెకు ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు. అబ్దుల్లా, అబూ బాకర్, అలీ. అబ్దుల్లా ఇవాళ కాలం చెందారు.

Read Also: Surya 42 Movie: 3డీ ఫార్మాట్లో రానున్న సూర్య 42 మూవీ

కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆయనకు వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే రెండు రోజులు ఆరోగ్యం నిలకడగానే ఉన్న.. ఇవాళ విషమించడంతో చనిపోయారు. తన అన్న మృతిని జీర్ణించుకోలేని ఖుష్బూ.. ట్విట్టర్ వేదికగా భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. మనం ఎంతగానో ప్రేమించే వ్యక్తులు ఎప్పటికీ మనతోనే ఉండాలని అనుకుంటాము, కానీ సమయం వస్తే గుడ్ బై చెప్పాల్సిందే. నా అన్న ప్రయాణం ఇవాళ్టితో ముగిసింది. అతని ప్రేమ, మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ మాపై ఉంటాయి. ఆయన బతకాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. పెద్దలు చెప్పినట్లు, జీవిత ప్రయాణాన్ని భగవంతుడు నిర్ణయిస్తాడు. అన్నయ్య ఆత్మకు శాంతి చేకూరాలి” అంటూ ట్వీట్ చేశారు. ఇక ఖుష్బూ సోదరుడు నటుడిగా కొన్ని చిత్రాల్లో కూడా ఈయన నటించారు.

Exit mobile version