Fauji; ‘ఫౌజీ’ సినిమాపై జయప్రద క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దశాబ్దాల పాటు తన నటనతో, అందంతో భారతీయ సినీ ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి జయప్రద. ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ పీరియడ్ డ్రామా ‘ఫౌజీ’లో భాగమయ్యారు. ‘సీతా రామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు తల్లిగా లేదా ఒక పవర్‌ఫుల్ రాయల్ పాత్రలో ఆమె కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సుమారు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మలయాళ బ్యూటీ ఇమాన్వీ (Imanvi) హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. 1940ల నాటి యుద్ధ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో ప్రభాస్ ఒక బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న జయప్రద..
Also Read : Salman Khan: సల్మాన్ – నయనతార తో.. దిల్ రాజు మాస్టర్ ప్లాన్..!
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
‘ప్రభాస్‌తో కలిసి నటించడం నాకు దక్కిన గొప్ప అవకాశం, దీన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. హను రాఘవపూడి ఈ కథను చాలా అద్భుతంగా, విజువల్ వండర్‌లా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుత సినిమాల గురించి మాట్లాడుతూ.. అప్పట్లో ఎమోషన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌కు ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా నటుడిలోని భావ వ్యక్తీకరణే సినిమాకు ప్రాణమని ఆమె చెప్పుకొచ్చారు. తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి స్పందిస్తూ.. తనకు ఇప్పటికీ చీరలంటేనే ఇష్టమని, ట్రెడిషనల్ లుక్‌లో ఉండే అందం మరెందులోనూ ఉండదని తన ఫ్యాషన్ సీక్రెట్‌ను బయటపెట్టారు. నార్త్, సౌత్ రెండు ఇండస్ట్రీలలోనూ తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ సినిమాలో జయప్రద వంటి లెజెండరీ నటి చేరడం ‘ఫౌజీ’ సినిమాకు మరింత నిండుదనాన్ని తీసుకొచ్చింది.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..