Senior Actress Phone calls with kp chowdary: కబాలి చిత్రం నిర్మాత కె.పీ చౌదరి అలియాస్ కృష్ణ ప్రసాద్ చౌదరి 100 గ్రాముల కొకైన్ తో పోలీసులకు దొరికిపోవడం ఒక్కసారిగా పెను కలకలాన్ని సృష్టించింది. టాలీవుడ్ లో నిర్మాతగా పలు సినిమాలు నిర్మించిన కృష్ణ ప్రసాద్ చౌదరి పోలీసులు విచారణలో పలు కీలకమైన విషయాలు బయట పెట్టాడు. తాను మొత్తం 12 మందికి డ్రగ్స్ అమ్మినట్టు ఒప్పుకున్నాడు. ఆ 12 మందిలో పలు బడా బాబుల పేర్లు సహా పలువురు యువతుల పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అయితే అతను అషు రెడ్డి అనే అనే నటితో పాటు మరో ఆర్టిస్టుతో కూడా వందల ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే కృష్ణ ప్రసాద్ చౌదరి మాట్లాడింది ఒక సీనియర్ నటీమణితో అనే ప్రచారం మొదలైంది. కొంతమంది నటీమణులతో కేపీ చౌదరి కలిసి ఉన్న ఫోటోలు బయటకు రావడంతో పోలీసులు చెబుతున్న ఆర్టిస్ట్ ఆమెనే అనే ప్రచారం జరుగుతోంది.
Ashu reddy: డ్రగ్స్ కేసులో అషురెడ్డి.. వందల ఫోన్ కాల్స్.. అవకాశాలు లేకున్నా లగ్జరీ లైఫ్ అందుకేనా?
ఇక ఆమె టాలీవుడ్ లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది, ఆమెకు మంచి పాపులారిటీ కూడా ఉంది అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం ఆమె ఎవరు అనే విషయాన్ని బయట పెట్టలేదు. కేవలం అషు రెడ్డితో మాట్లాడుతున్న విషయాన్ని మాత్రమే పోలీసులు కస్టడీ రిపోర్టులో పొందుపరచగా ఆ వివరాలు మీడియాకు వెల్లడయ్యాయి. ఇక కేపీ చౌదరి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆ ఆర్టిస్ట్ నిజంగానే సీనియర్ నటీమణా? లేక ఇండస్ట్రీలో ఉన్న మగ ఆర్టిస్టా? అనే విషయాల మీద పోలీసులు లేదా కేపీ చౌదరి ఒక క్లారిటీ ఇస్తే తప్ప ఎవరితో అతను మాట్లాడుతున్నాడు అనే విషయం మీద సందిగ్ధత తొలగిపోయే అవకాశం అయితే కనిపించడం లేదు. ఈ విషయంలో కేపీ చౌదరి మీడియాతో మాట్లాడడానికి పూర్తిగా ఆసక్తి చూపించడం లేదు. పోలీసులు తన మీద ఫాల్స్ అలగేషన్స్ వేస్తున్నారు అని చెప్పి ఆయన సైడ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్లబోతోంది అనేది.
Tollywood Actress: కేపీ చౌదరితో వందల ఫోన్ కాల్స్ మాట్లాడిన సీనియర్ నటి ఎవరు?
Show comments