Site icon NTV Telugu

India Pak War: “పాకిస్తాన్ ఎప్పటికీ మర్చిపోదు..” భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ క్రీడా ప్రపంచం ఏమందంటే..?

India Pak War

India Pak War

India Pak War: పాకిస్తాన్ జమ్మూ సహా పశ్చిమ సరిహద్దు వద్ద ఉన్న భారత సైనిక స్థావరాలపై దాడి ప్రయత్నాలు చేసింది. కానీ భారత వైమానిక రక్షణ వ్యవస్థ వాటిని విజయవంతంగా తిప్పికొట్టింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. భారత మాజీ క్రికెట్ లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్తాన్‌ను తీవ్రంగా విమర్శించారు. శాంతిగా ఉండే అవకాశం ఉన్నప్పుడు యుద్ధాన్ని ఎంచుకుంది అంటూ సెహ్వాగ్ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు.

Read Also: Ind Pak War Effect: ఇండియా, పాకిస్తాన్ యుద్ధం ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.!

సెహ్వాగ్ తన సోషల్ మీడియా ఖాతాలో.. శాంతిగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ యుద్ధాన్ని ఎంచుకుంది పాకిస్తాన్. తమ ఉగ్రవాద ఆస్తులను కాపాడుకునేందుకు ఈ చర్యలు చేపట్టడం వారి పరిస్థితిని వెల్లడిస్తోందని అన్నారు. పాకిస్తాన్ ఎప్పటికీ మరిచిపోలేని విధంగా మన బలగాలు సరైన సమాధానమిచ్చాయని సెహ్వాగ్ రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ కూడా తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ ఓ రెగ్యులర్ రోగ్ దేశం. భారత్ వారిని ఎలా నాశనం చేస్తుందో చూద్దాం అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అలాగే, రెండు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భారత సైన్యానికి అభినందనలు తెలియజేశారు. మన జాతీయ జెండా ఎగురుతుండడానికి, ప్రశాంతతకు నిలకడగా నిలిచే మన సైనికుల ధైర్యం, క్రమశిక్షణ, త్యాగమే కారణం. ఆపరేషన్‌సిందూర్ సమయంలో మనకు ఈ నిజం మరింత స్పష్టంగా తెలుస్తోంది. భారతదేశం మీతో ఉంది. జై హింద్.. అని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కాపిటల్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ బ్లాక్‌ఔట్‌ల కారణంగా రద్దు చేయబడింది. భారత సైన్యం ధైర్యంగా ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు వెల్లువెత్తుతోంది.

Exit mobile version