NTV Telugu Site icon

Minister Seethakka: జైలుకు వెళ్లి యోగా చేస్తా అన్న కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారు?

Seetakka

Seetakka

Minister Seethakka: జైలుకు వెళ్లి యోగా చేస్తా అన్న కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారు? అని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చిట్ చాట్ లో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కేబినెట్ ఆమోదం తీసుకొని ఫార్ములా ఈ రేస్ కు కేటీఆర్ డబ్బులు చెల్లించారా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ లో అంబెడ్కర్ ను, అసెంబ్లీలో దలిత స్పీకర్ ను అవమానించారన్నారు. ప్రభుత్వం అనుమతి లేని అంశానికి సభలో చర్చ ఎందుకు? అని ప్రశ్నించారు. గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చిన కేసుకు సభలో చర్చ అవసరం లేదన్నారు. బీఏసీ లో ఈ ఫార్ములా మీద చర్చ కోసం బిఆర్ఎస్ ఎందుకు అడగలేదు? ముసుగు వేసుకుని బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు.

Read also: Duvvada Srinivas: తప్పుడు కేసులు పెట్టి హింసించాలనుకుంటే.. రెట్టింపు ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది!

తప్పు లేకపోతే విచారణ ఎదుర్కొని నిర్దోషిగా బయటికి రావచ్చు కదా? అని ప్రశ్నించారు. కేటీఆర్ తన సమస్యను రాష్ట్ర ప్రజల సమస్య గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గతంలో ప్రభుత్వ కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టుకు వెళితే తప్పు పట్టిన కేటీఆర్..ఇప్పుడు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కారు?అని తెలిపారు. కేటీఆర్ కు నిజాయితీ లేదని మండిపడ్డారు. లక్షలాది మంది రైతుల ప్రయోజనం చేకూర్చే భూభారతి బిల్లు పై చర్చ జరగకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారు. వాళ్ల భూకబ్జాలో బాగోతం బయటపడుతుందని సభను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని, అందరూ చట్టం ముందు సమానులే.. ఫార్ములా ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందే అన్నారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రుల విమర్శలు