NTV Telugu Site icon

Video Viral: కుక్కకు సీమంతం.. వీడియో వైరల్

Dog

Dog

ఈరోజుల్లో పిచ్చి మరీ హద్దులు దాటిపోతుంది. సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసం చేయరాని పనులు చేస్తున్నారు. మరీ ఈ వీడియో సోషల్ మీడియాలో గుర్తింపు కోసమో.. లేదంటే తమ ప్రేమను చాటుకోవడం కోసం చేశారో తెలియదు కానీ.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Neethone Nenu: జోరుమీదున్న కుషిత క‌ళ్ల‌పు.. హీరోయిన్ గా‘నీతోనే నేను’ టైటిల్ పోస్ట‌ర్ లాంచ్‌

సాధారణంగా స్త్రీలకు సీమంతం చేస్తారు. కానీ ఈరోజుల్లో పెంపుడు జంతువులకు కూడా సీమంతం చేస్తున్నారు. గతంలో ఆవులు, పిల్లులకు సీమంతం చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ పెంపుడు కుక్క(Pet dog) కు మహిళ సీమంతం చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మరీ జంతువుల ప్రేముంటే అల్లారు ముద్దుగా పెంచుకోవాలి. కానీ ఇలా సీమంతం చేయడం ఏంటని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పెంపుడు కుక్కకు సీమంతం చేసిన ఘటనపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Assam CM: కాంగ్రెస్‌ లవ్‌ జిహాద్‌ వ్యాఖ్యలపై అసోం సీఎం ఫైర్‌

కర్ణాటకలోని గదగ్ జిల్లా లక్ష్మేశ్వర్లో జరిగింది. జంతుప్రేమికుడు అశోక్ తన ఇంట్లో కుక్కకు సీమంతం చేయగా.. ఇరుగు పొరుగు మహిళలు వచ్చి హారతులిచ్చి వేడుకను ఘనంగా జరిపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.