Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asian Games 2026: ఆసియా క్రీడల్లో మహిళల 10,000 మీటర్ల రేసులో భారత్‌కు దశాబ్ద కాలానికి పైగా ఎదురుచూస్తున్న పతకం కల నెరవేరింది! గురువారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో భారత అథ్లెట్ సీమా కుమారి అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకం సాధించి, ఏకంగా 16 ఏళ్ల సుదీర్ఘ పతక నిరీక్షణకు తెరదించింది. చివరివరకూ ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ రేసును సీమా 32:50.05 నిమిషాల్లో ముగించి మూడో స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల్లో మహిళల 10,000 మీటర్ల విభాగంలో భారత్‌కు ఇది కేవలం మూడో పతకం కావడం విశేషం. ఇదే విభాగంలో బహ్రెయిన్‌కు చెందిన విన్‌ఫ్రెడ్ యావి 32:39.18 నిమిషాల్లో రేసు పూర్తి చేసి స్వర్ణం సాధించగా, జపాన్ అథ్లెట్ నోజోమి తనకా 32:41.54 నిమిషాలతో రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు.
ఈ రేసు ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా స్వర్ణం కోసం విన్‌ఫ్రెడ్ యావి, నోజోమి తనకా మధ్య ఆఖరి క్షణం వరకు తీవ్ర పోటీ నడిచింది. ఇద్దరూ తమ వేగాన్ని, స్టామినాను పరీక్షించుకుంటూ పోటీ పడగా, చివరికి బహ్రెయిన్ రన్నర్ కొద్ది తేడాతో ముందుకెళ్లి బంగారు పతకాన్ని చేజిక్కించుకుంది. మరోవైపు మన సీమా కుమారి మాత్రం ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా, ఎంతో సమయస్ఫూర్తితో, సహనంతో పగడ్బందీగా పరిగెత్తింది. ముందున్న ఇద్దరి వేగాన్ని అందుకోవడం కష్టమైనప్పటికీ, వెనుకాల వస్తున్న ఇతర రన్నర్లు తనను దాటకుండా జాగ్రత్త పడుతూ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. చివరి వరకు తన శక్తినంతా ధారపోసి మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. 2010 తర్వాత ఈ ఈవెంట్లో భారత్ సాధించిన తొలి పతకం ఇదే కావడం విశేషం. అంతేకాదు, ప్రసిద్ధ ఐచి-నాగోయా ఆసియా క్రీడల్లో భారత అథ్లెటిక్స్ బోణీ కొట్టిన మొదటి పతకం కూడా సీమా ఖాతాలోనే పడింది.
Also Read
- Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
- BJP: రాహుల్ గాంధీకి అవగాహన లేదు..‘‘ఓట్ చోరీ’’పై బీజేపీ స్ట్రాంట్ కౌంటర్..
- Best Postal Scheme: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్.. రూ.2 లక్షలకు రూ. 4 లక్షల లాభం..
- Election Commission: విభేదాలకు కారణమైన ఫారం 6పై ఈసీఐ ఫుల్ క్లారిటీ..
ఇంతకీ ఎవరీ సీమా?
హిమాచల్ ప్రదేశ్‌లో 2001, జనవరి 10న జన్మించిన సీమా కుమారి, 5,000 మీటర్లు, 10,000 మీటర్ల సుదీర్ఘ పరుగు పోటీల్లో తనదైన ముద్ర వేసుకుంటూ వస్తోంది. 2018 జూలై నుంచి ‘ఖేలో ఇండియా’ ప్రోగ్రామ్ ద్వారా శిక్షణ పొందుతున్న ఆమె, 2026 ఆసియా క్రీడల కోసం ప్రత్యేకంగా నేషనల్ కోచింగ్ క్యాంప్‌లో మెరుగైన శిక్షణ తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (TOPS)తో పాటు ఆన్యువల్ క్యాలెండర్ ఫర్ ట్రైనింగ్ అండ్ కాంపిటీషన్ (ACTC) ద్వారా ఆమెకు అవసరమైన ఆర్థిక సహాయం లభించింది. గత కొన్ని ఏళ్లుగా సీమా స్థిరమైన ప్రదర్శనతో అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. హాంగ్‌కాంగ్‌లో జరిగిన 2024 ఆసియన్ క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్‌లో సీనియర్ మహిళల రేసులో స్వర్ణం గెలుచుకున్న సీమా, 2025లో జరిగిన ఎఫ్ఐఎస్యూ (FISU) వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో 5,000 మీటర్ల విభాగంలో రజత పతకం సాధించింది. ఆ తర్వాత 2026లో 65వ నేషనల్ ఇంటర్-స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 10,000 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించి తన ఫామ్‌ను చాటుకుంది. అంతేకాకుండా, ఈ ఏడాదే ఆమె తన వ్యక్తిగత ఉత్తమ రికార్డులను కూడా తిరగరాసింది. మార్చి నెలలో కాలిఫోర్నియాలో జరిగిన ‘ది టెన్’ పోటీల్లో 10,000 మీటర్ల రేసును 32:02.43 నిమిషాల్లో పూర్తి చేసి ఐదో స్థానంలో నిలవడమే కాకుండా, తన కెరీర్లోనే అత్యుత్తమ సమయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాతి నెలలోనే 5,000 మీటర్ల ఈవెంట్లో 15:16.20 నిమిషాలతో మరొక పర్సనల్ బెస్ట్ రికార్డును నెలకొల్పింది. ప్రస్తుతం 25 ఏళ్ల వయసులోనే ఆసియా క్రీడల్లో కాంస్యం గెలుచుకుని, భారత సుదీర్ఘ పరుగు పందెం (లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్) విభాగానికి తానొక ప్రధానమైన అథ్లెట్‌నని నిరూపించుకుంది.
తాజావార్తలు
-
Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
-
Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
-
BJP: రాహుల్ గాంధీకి అవగాహన లేదు..‘‘ఓట్ చోరీ’’పై బీజేపీ స్ట్రాంట్ కౌంటర్..
-
OTR: దసరాలోపు పదవుల భర్తీ పూర్తి చేసే ఆలోచన?
-
Best Postal Scheme: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్.. రూ.2 లక్షలకు రూ. 4 లక్షల లాభం..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!