NTV Telugu Site icon

Seediri Appalaraju : బాబు.. మీ అమోగమైన పాలన ప్రత్యక్షంగా చూశారు

Seediri Appalaraju

Seediri Appalaraju

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మా పలాస బహిరంగ సభ పెట్టారన్నారు మంత్రి సీదిరి అప్పల రాజు. ఇవాళ ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. బాబు.. మీ అమోగమైన పాలన ప్రత్యక్షంగా చూశారన్నారు. రాష్ర్టాన్ని పద్నాలుగెండ్లు ఎలా దోచుకున్నారో ప్రజలు చూశారని ఆయన విమర్శించారు. పెత్తందారులు రాష్ర్టాన్ని ఎలా సంకనాకించారో చుసామని, బాబు స్కిల్ డవలప్ మెంట్ స్కాంలో పైనాన్స్ సెక్రటరీ పీవీ రమేష్ అన్నారు. రూల్స్ అతిక్రమించి ఒరల్ ఇనస్ట్రక్షన్ సిఎం ఇచ్చారని రాసిందెవరని ఆయన ప్రశ్నించారు. పివి రమేష్ నొట్ పైల్ లో స్వదస్తూరితో రాసారు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఓ దళిత , ఆర్థిక మేధావిగా మీకు తెలియదా, అదే బడ్జెట్‌లో ఏం చేశామో అని ఆయన మంత్రి సీదిరి అప్పాలరాజు అన్నారు.

 

వంద కొట్లే ఉన్నాయి , జీతాలు ఇవ్వలేరని యనమల రామకృష్ణుడు మాటాడారని, దళితుడిగా పుట్టి దళితులకు నష్టం చెసేవిధంగా పి.వి రమేష్ మాటాడటం తగదన్నారు. చంద్రబాబు లాంటి పెత్తందారుకు ఎలా వంతపాడుతారని మండిపడ్డారు. 14 ఏండ్లలో చంద్రబాబు ఏం పీకారని ఆయన ధ్వజమెత్తారు. విద్యా, వైద్య రంగాలను‌ నిర్వీర్యం చేశావు కదా బాబు అంటూ ఆయన విమర్శలు చేశారు. పేదవాడికి మేలు చేస్తే బందిపోటు పాలనా అని మంత్రి ప్రశ్నించారు. నీకు సిగ్గు , లజ్జా ఉందా బాబు.. అని బాబు బ్రయిన్ చైల్డ్ అన్నది ఒక్క ప్రొజెక్ట్ చెప్పు నీ బ్రతుక్కి‌ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఇరిగేషన్ ప్రొజెక్ట్ పుర్తి అయిందా చెప్పు అని ఆయన సవాల్‌ విసిరారు. ఒక్క మెడికల్ కళాశాల కట్టావా , ఒక్క పొర్ట్ కట్టావా… నీ మార్క్ ఏది అని ఆయన అన్నారు.