రైతులు పంటలు వేసేముందు నేలలు, ఎరువుల గురించి చూడటం మాత్రమే కాదు.. విత్తన శుద్ధి చెయ్యడం కూడా చెయ్యాలి..అప్పుడే తెగుళ్లు కూడా రాకుండా ఉంటాయి.. ఎటువంటి క్రిములు లేకుండా రాకుండా పురుగు మందు లేదంటే తెగులు మందును పొడిరూపంలో గాని, ద్రవ రూపంలో గాని విత్తనానికి పట్టించే విధానాన్ని విత్తనశుద్ధి అంటారు.కేవలం మందులు మాత్రమే వాడటం మాత్రమే కాదు..వేడి నీటిలో ఉంచడం,లేదా ఎండలో ఉంచడం చేసిన అది విత్తన శుద్ధి అవుతుంది… అసలు ఈ శుద్ధిని ఎలా చేస్తారో చూద్దాం..
విత్తన శుద్ధిని ఎలా చేస్తారు? ప్రయోజనాలు ఏంటంటే?
*. మొలకెత్తే విత్తనాలను, లేత మొక్కలను విత్తనము ద్వారా లేదా నేల ద్వారా సంక్రమించే శిలీంధ్రాల నుండి కాపాడుకోవచ్చు..కుళ్ళు తెగుళ్లు రాకుండా ఉంటాయి..
*. పప్పజాతి పంట మొక్కల వేర్లపై బుడిపెల సంఖ్య పెరుగుతుంది.. దాంతో దిగుబడి కూడా పెరుగుతుంది..
*. తక్కువ ఖర్చుతో, తెగుళ్ళు, పురుగులను అదుపులో ఉంచవచ్చు.
*. ఇలా చెయ్యడం వల్ల నిల్వ చేసినపుడు ఆశించే పురుగుల నుండి కూడా రక్షణ పొందవచ్చు.
*. ముఖ్యంగా నేలద్వారా సంక్రమించే తెగుళ్ళను, పురుగు లను సమర్థవంతంగా నివారించవచ్చు..
*. విత్తన పై భాగంలో ఆశించిన శిలీంధ్ర బీజాలను నిర్మూలించడానికి విత్తనశుద్ధి మందును, విత్తనంపై, పొడి రూపంలో గాని, లేదా ద్రవ రూపంలో కాని పట్టించినప్పుడు పై పొరల్లో ఉన్న శిలీంధ్రాలు నిర్మూలించబడతాయి..
*. శిలీంధ్ర బీజాలను నిర్మూలించడానికి విత్తనశుద్ధికి ఉపయోగించే వుందు, విత్తనం లోపలి భాగంలోకి చొచ్చుకొనిపోయి శిలీంధ్రాలు నిర్మూలించ బడుతాయి.. ఇలా విత్తన శుద్ధి చెయ్యడం వల్ల ఛీడపీడల ప్రభావం కూడా ఉండదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.. ఇలా చెయ్యడం ద్వారా పంటకు మంచి బలం కూడా..ఏ పంటకు ఎలా విత్తన శుద్ధి చెయ్యాలో వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..