NTV Telugu Site icon

British Envoy: దెబ్బకు దెబ్బ కొట్టిన భారత్‌.. బ్రిటన్ హైకమిషన్‌ బయట బారికేడ్లు తొలగింపు

British Envoy

British Envoy

British Envoy: గతవారం బ్రిటన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం దగ్గర ఖలిస్తాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు. భారత హైకమిషన్ కార్యాలయంపై ఉన్న భారత త్రివర్ణ పతాకాన్ని తొలగించారు. దీంతో మరో భారీ పతాకాన్ని అప్పటికప్పుడు తెచ్చి కమిషన్ కార్యాలయంపై ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో లండన్‌లోని భార హైకమిషన్‌పై ఖలిస్తాన్ మద్దతుదారులు చేసిన దుశ్చర్యను ఇండియా తీవ్రంగా పరిగణిస్తోంది. భారత హైకమిషన్‌ వద్ద భద్రతా వైఫల్యంపై భారత్‌ తీవ్రంగా మండిపడింది. అక్కడితో ఆగకుండా భారత్ బ్రిటన్‌కు ఇవాళ మరో షాకిచ్చింది. ఢిల్లీ చాణక్యపురిలోని శాంతిపథ్‌లో ఉన్న బ్రిటన్ హైకమిషన్ కార్యాలయం బయట బారికేడ్లను భారత్ తొలగించింది. ఇన్నాళ్లూ బ్రిటన్ హైకమిషన్ కార్యాలయానికి భద్రతగా ఉంచిన బారికేడ్లను సడన్‌గా తొలగించడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం రాత్రి 10:30 గంటలకు న్యూఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషనర్ నివాసం వెలుపల ఉన్న బారికేడ్లను తొలగించారు. భద్రతా విషయాలపై వ్యాఖ్యానించడానికి బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధి నిరాకరించారు.

Read Also: Russian Drone Attack: కీవ్‌లోని ఓ పాఠశాలపై రష్యా డ్రోన్ దాడి.. ముగ్గురు దుర్మరణం

దీనిపై ఢిల్లీ పోలీసులు వెంటనే స్పందించారు. హైకమిషన్ కార్యాలయం దగ్గర తగినంత భద్రత ఉందని తెలిపారు.భద్రతా సిబ్బందిలో మాత్రం ఎటువంటి మార్పు లేదని.. మునుపటి మాదిరిగానే భద్రత కొనసాగిస్తున్నట్లు సమాచారం. బ్రిటిష్ హైకమిషన్ బయట భద్రతా ఏర్పాట్లు చెక్కు చెదరకుండా ఉన్నాయన్నారు. అయితే సందర్శకులు రాకుండా అడ్డంకిగా ఉన్న బారికేడ్లు మాత్రం తొలగించమని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. లండన్‌లోని భారత హైకమిషన్‌ భవనంపై ఎగురవేసిన జాతీయ జెండాను ఖలిస్థాన్‌ అనుకూలవాదులు కిందికి దింపేసి అగౌరవ పరచిన దుశ్చర్య భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ విషయంలో ఢిల్లీలోని బ్రిటన్‌ సీనియర్ దౌత్యవేత్తకు సమన్లు కూడా జారీ చేసింది.

Show comments