Ban on Kite Flying: రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో మకర సంక్రాంతి, రాబోయే పండుగల దృష్ట్యా జిల్లా యంత్రాంగం జనవరి 31 వరకు నగరంలో 144 సెక్షన్ విధించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన తర్వాత నాలుగు గంటల పాటు గాలిపటాలు ఎగురవేయడాన్ని నిషేధించింది. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడానికి ఉపయోగించే మెటల్ మిక్స్‌డ్ మాంజా వల్ల ద్విచక్ర వాహన చోదకులు, పక్షులు ప్రాణాలు కోల్పోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు అదనపు జిల్లా కలెక్టర్ (ఏడీసీ) ప్రభా గౌతమ్ తెలిపారు.
China Manja: నాగోల్ చిన్నారి మాంజా ఘటన.. చైతన్యపురి సీఐ సీరియస్ వార్నింగ్
జిల్లా పరిధిలోని మెటల్ మాంజా హోల్‌సేల్, రిటైల్ అమ్మకాలు, వినియోగాన్ని నిషేధించడానికి జిల్లా కలెక్టర్ తారాచంద్ మీనా సెక్షన్ 144 నిబంధనలను అమలు చేస్తున్నారని అదనపు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు గాలిపటాలు ఎగరవేయడంపై నిషేధం ఉంటుందని అధికార యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మకర సంక్రాంతికి ముందు మాంజాతో జరుగుతున్న సంఘటనల దృష్ట్యా గెహ్లాట్ ప్రభుత్వం రాష్ట్రంలో గాలిపటాలు ఎగరవేయడాన్ని నిషేధించింది.