Secret Cameras: సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని అనుమానమా? స్మార్ట్‌ఫోన్‌తో ఇట్టే కనిపెట్టేయండి!
- కొత్త ప్రాంతాలలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని అనుమానమా?
- సీక్రెట్ కెమెరాలతో మహిళలకి ఇబ్బందులు.
- సీక్రెట్ కెమెరాలను స్మార్ట్‌ఫోన్‌తో ఎలా కనిపెట్టవచ్చంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secret Cameras: మనం ఎక్కడికైనా విహారయాత్రల కోసం లేదా వ్యాపారాల నిమిత్తం వెళ్ళినప్పుడు అనేక మంది హోటల్స్‌కి వెళ్లడం సహజమే. కానీ, కొన్ని హోటల్ రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు అమర్చడం లాంటి ఘటనలకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటివల్ల ముఖ్యంగా మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏ ప్రాంతం సురక్షితంగా ఉందో తెలుసుకోవడానికి మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా సీక్రెట్ కెమెరాలను గుర్తించవచ్చు. అది ఎలా అంటే..
Also Read: KTR-Trisha: త్రిష.. నిన్ను కెప్టెన్‌గా చూస్తామని ఆశిస్తున్నా: కేటీఆర్
Also Read
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
- IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
- Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
హోటల్ రూమ్ లేదా ఏదైనా ప్రవేట్ రూమ్స్ లోకి అడుగు పెట్టినప్పుడు, స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ లైట్ ఉపయోగించి సీక్రెట్ కెమెరాలను గుర్తించవచ్చు. ఇందుకోసం గదిలోని అన్ని లైట్లు ఆఫ్ చేసి, ఫోన్ ఫ్లాష్‌ను ఆన్ చేయండి. రూమ్‌లోని లైటింగ్ లేదా ప్రతిబింబించే లెన్స్‌ను గుర్తించి సీక్రెట్ కెమెరాలను వెతకండి. ప్రత్యేకంగా గడియారాలు, అద్దాలు, స్మోక్ డిటెక్టర్లు, ఇంకా USB ఛార్జింగ్ పోర్టులు వంటి ప్రాంతాల్లో కెమెరాలు ఉండే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్ కెమెరాలు ఇన్‌ఫ్రారెడ్ లైట్స్‌ను గుర్తించడంలో సహాయపడతాయి. మన కళ్లకు ఈ లైట్‌లు కనిపించకపోయినా, ఫోన్ కెమెరాలు వాటిని గుర్తించగలవు. లైట్లు ఆఫ్ చేసిన తరువాత రూమ్‌లో ఉన్న ప్రతి ప్రదేశాన్ని కెమెరా ద్వారా తనిఖీ చేయండి. అలా వెతుకుతున్న సమయంలో ఏదైనా చుక్కలు లేదా మెరుస్తున్న లైట్‌లను చూసినప్పుడు అది సీక్రెట్ కెమెరా కావచ్చని గ్రహించండి.
స్పై కెమెరాలు సాధారణంగా డేటాను ఇతర పరికరాలకు బదిలీ చేయడానికి వైఫై లేదా బ్లూటూత్ కనెక్షన్లను ఉపయోగిస్తాయి. కాబట్టి, మీరు ఉపయోగిస్తున్న వైఫై నెట్‌వర్క్‌లో అనుమానాస్పదమైన “Camera” వంటి పేర్లు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి. వాటిని సంబంధిత వ్యక్తులకు నివేదించండి. ఇకపోతే, సీక్రెట్ కెమెరాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్‌లు కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్, iOS స్టోర్లలో ఈ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు హోటల్ లేదా కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఈ యాప్‌లను ఉపయోగించి కెమెరాలను గుర్తించవచ్చు. మొత్తానికి ఇలాంటివి ఉన్నాయని ఏదైనా అనుమానం ఉంటే, వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి. ఈ చిట్కాలు పాటించడం ద్వారా మీరు ఆందోళన లేకుండా సురక్షితంగా ఉండవచ్చు.
తాజావార్తలు
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!