NTV Telugu Site icon

Earthquake: అమెరికాలో మరోసారి భూప్రకంపనలు

Earth

Earth

అమెరికాలో మరోసారి భూకంపం సంభవించింది. న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో శుక్రవారం మరోసారి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రెండో సారి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. న్యూజెర్సీలోని గ్లాడ్‌స్టోన్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం 9.7 కిలోమీటర్ల లోతులో ఉద్భవించిందని తెలిపింది. ఇక భూప్రకంపనలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ ప్రకంపనలకు పలు నివాసాలు కుదుపులకు గురయ్యాయి.

ఇది కూడా చదవండి: Manjummel Boys Review: మలయాళ ఇండస్ట్రీ హిట్ ‘మంజుమ్మల్ బాయ్స్’ రివ్యూ..

శుక్రవారం మొదటిసారి న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో భూకంపానికి ప్రభావితమయ్యాయి. న్యూజెర్సీలో శుక్రవారం ఉదయం 10:23 నిమిషాలకు 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో ఉద్భవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. మొదటి సారి భూప్రకంపనలకు గురైన 8 గంటలకే రెండోసారి చోటుచేసుకున్నాయి. ఇక ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని.. ఎలాంటి నష్టం జరగలేదని న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Weight Loss : త్వరగా బరువు తగ్గాలంటే వీటిని రోజూ తినాల్సిందే..

ఇటీవల తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. ఈ ఘటనలో తొమ్మిది మృతిచెందగా.. దాదాపు 2 వేల మంది గాయాలు పాలయ్యారు. ఈ ఘటనలో పలు నివాసాలు, వాణిజ్య సముదాయాలు నేలకొరిగాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరికొందరైతే భయాందోళనతో పరుగులు తీశారు. అధికారులు అప్రమత్తమై సహాయ చర్యలు చేపట్టారు. శిథిలాలు తొలగించారు. పరిస్థితుల్ని చక్కబెట్టారు.

ఇది కూడా చదవండి: Komaram Bheem: సరిహద్దు దాటిన ఏనుగు.. 53 గంటల పాటు తెలంగాణలో సంచారం