NTV Telugu Site icon

TG: రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె..

New Project

New Project

నిన్న మధ్యాహ్నం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో చర్చలు అసంపూర్ణంగా మారడంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగనుంది. నిన్న సాయంత్రం దాదాపు మూడున్నర గంటల పాటు DME వాణి తో చర్చలు జరిపారు. కానీ ఆ చర్చలు కూడా విఫలమయ్యాయి. యథాతథంగా సమ్మె కొనసాగుతుందని జూనియర్ డాక్టర్లు తెలిపారు. కొన్ని సమస్యల పరిష్కారించేందుకు ప్రభుత్వం సానుకూల స్పందించింది. కానీ అన్ని డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని జూడాలు తెలిపారు. సమ్మెతో ఆసుపత్రుల్లో రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా వైద్యులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం ఇవ్వాళ జూడాల తో మరోసారి చర్చలకు వెళ్లే అవకాశం ఉంది.

READ MORE: Minister Narayana: ఏపీలో అప్పటి నుంచే అన్న క్యాంటీన్లు..(వీడియో)

నెలనెలా ఉపకార వేతనాలు చెల్లించడమే కాకుండా దీర్ఘకాలికంగా ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతులు లేవని, ప్రభుత్వం నుంచి వచ్చే నెలనెలా ఉపకార వేతనం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో.. నేటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు సమ్మెకు పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో OP సేవలు, తాత్కాలిక OT సేవలను బహిష్కరించి జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. స్టై ఫండ్ రెగ్యులర్ గా రావాలని డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీ పూర్తయిన పీజీ లకు ఖచ్చితంగా ప్రభుత్వ సర్వీస్ అని పెట్టి 2.5లక్షలు ఇస్తామన్నారు నెలకు.. ఇప్పుడు 92వేలు ఇస్తా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. NMC గైడ్ లైన్స్ ప్రకారం హాస్టల్ వసతి సరిగ్గా ఇవ్వడం లేదని మండిపడ్డారు. డాక్టర్ల పై పేషంట్స్ బందువుల నుంచి జరుగుతున్న దాడులు ఆపాలని అన్నారు. పని ప్రదేశాల్లో భద్రత పెంచాలన్నారు.

Show comments