NTV Telugu Site icon

Tension in YCP: కాకినాడ వైసీపీలో టెన్షన్.. సీట్ల మార్పులు చేర్పులపై ఎమ్మెల్యేలు భేటీ

Ycp

Ycp

కాకినాడ జిల్లా వైసీపీలో మార్పులు చేర్పులు ప్రచారంతో పొలిటికల్ స్క్రీన్ హీట్ ఎక్కింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబులకి అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఏం జరుగుతుందో ఏంటోనని టెన్షన్ పడుతున్నారు. జగ్గంపేటలో ఎమ్మెల్యేకు మద్దతుగా ఇద్దరు ఎంపీపీలు మండల పార్టీ అధ్యక్షులు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ఇద్దరు ఎంపీపీలు జడ్పీటీసీలు డుమ్మా కొట్టారు. ఎటువంటి అపోహలు అవసరంలేదని పైకి చెప్తున్నా లోలోపల తెగ మదన పడిపోతున్నారు.

Read Also: Pakistan : ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు.. నేడు ఎన్నికల షెడ్యూల్‌?

అయితే, పిఠాపురం ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకి మద్దతుగా ఆయన అనుచరులు క్యాంప్ ఆఫీసు కి చేరుకున్నారు. పెండెంకి మద్దతుగా నినాదాలు చేశారు. ప్రతిపాడులో కూడా సీట్ చేంజ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. జగన్ పై తనకు నమ్మకం ఉందని ఎంపీకి పోటీ చేస్తావా అని పార్టీ పెద్దలు అడిగారని ఇదే కంపార్ట్ అని చెప్పానని పెండెం దొరబాబు చెప్తున్నారు.. మరోవైపు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు సైతం అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు.. కన్నబాబును కాకినాడ ఎంపీగా పరిశీలిస్తున్నట్లు వైసీపీ అధిష్టానం తెలుస్తుంది.