Visakhapatnam South: ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఇంకా ఏపీలో కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు.. ఇంకా కొన్ని చోట్ల అసలు టికెట్ ఎవరికి అనేది ఉత్కంఠగా మారింది.. ఇక, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ సీటు విషయంలోనూ జనసేన పార్టీలో ఫైట్ నడుస్తోంది.. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ కి విశాఖ దక్షిణ సీటు ఖరారు అవ్వడంతో ఆశావహుల్లో అసంతృప్తి మొదలైంది.. అయితే, జనసేన పార్టీ ఎక్కడా.. అధికారికంగా వంశీ అభ్యర్థిత్వం ఖరారు చేయలేదు… కానీ, గతంలో 50 వేల ఓట్లు తేడాతో ఓడిపోయిన వంశీకి సీటు ఎలా ఇస్తారో చెప్పాలని పార్టీ నేతలను నిలదీసేవారు లేకపోలేదు.. విశాఖ చరిత్రలో వంశీ అంత ఘోరంగా ఓడిపోయిన నేత మరొకరు లేరని విమర్శించారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)కు చెందిన కొర్పొరేటర్ సాదిక్.. వంశీకి సీటు ఇస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని (వైసీపీ) అఖండ మెజార్టీతో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు సాదిక్.
Read Also: Aravind Kejriwal : మరోసారి ఈడీ ఎదుట కేజ్రీవాల్ గైర్హాజరు.. సమన్లు చట్టవిరుద్ధమన్న ఆప్
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వంశీకృష్ణ శ్రీనివాస్ ను పోటీకి దింపడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన, తెదేపా కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి వంశీకృష్ణ శ్రీనివాస్ విజయానికి కృషి చేయాలని టీడీపీ విశాఖ లోక్‌సభ నియోజకవర్గ బాధ్యులు ఎం.శ్రీభరత్ పిలుపునిచ్చారు.. పొత్తుల్లో త్యాగాలు తప్పవని ఆయన టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పేర్కొన్న విషయం విదితమే.. దక్షిణ నియోజకవర్గ తెదేపా తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ స్థానంపై వంశీకృష్ణ శ్రీనివాస్ ఆశలు పెట్టుకుంటే.. మరోవైపు సీతంరాజు సుధాకర్ కన్ను పడినట్టు కూడా ప్రచారం సాగుతోంది.. మరి విశాఖ దక్షిణ నియోజకవర్గంపై జనసేన అధినేత క్లారిటీ ఇచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో వేచిచూడాలి.
