చుట్టూ నీళ్లు, మధ్యలో రెస్టారెంట్ అలల శబ్దం నడుమ స్పైసి ఫుడ్ ను లాగిస్తుంటే ఆ కిక్కే వేరప్పా.. అబ్బా వింటుంటే ఎంత థ్రిల్ గా ఉందో కదా.. ఇక ఆ ప్లేస్ లో మనం ఉంటే ఇక మనసు ఎంతో హాయిగా ఉంటుంది..సముద్రంలో ఓడల్లో తినడం వేరు.. మధ్యలో రెస్టారెంట్ లో తినడం వేరు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. ఓ ద్వీపంలో ఇప్పుడు మనం చెప్పుకొనే రెస్టారెంట్ ఒకటి ఉంది.. ఆ రెస్టారెంట్ ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
సంద్రంలోంచి పొడుచుకొని వచ్చినట్లు ఓ కొండ మీద పూరిల్లు లాంటి ఓ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు.. ‘ది రాక్’ అని పేరుపెట్టారు.. ఈ రెస్టారెంట్ టాంజానియాలోని జాంజిబార్ ద్వీపసమూహంలో ఒకటైన ఉంగుజా ద్వీప తీరానికి ఆవల హిందూ మహాసముద్రంలో ఉంది ఇది. ఈ రెస్టారెంట్‌లో భోంచేయాలంటే, ఉంగుజా దీవి నుంచి పడవ మీద వెళ్లాల్సిందే.. ఇక్కడ పీతలు, రొయ్యలు, ఆక్టోపస్ వంటి సీఫుడ్‌కు ఈ రెస్టారెంట్ పెట్టింది పేరు.. వీటిలో ఎన్ని రకాల వెరైటీలు దొరుకుతాయి.. టాంజానియాకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో చాలామంది పనిగట్టుకుని మరీ ఈ రెస్టారెంట్‌కు వచ్చి, ఇక్కడి రుచులను ఫుల్లుగా తిని వెళుతుంటారు..
ఇక్కడ నిత్యం రద్దీగా ఉంటుంది.. పర్యాటాకులతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది.. బీచ్ లో రిసార్ట్స్ కూడా ఉన్నాయి.. అందుకే ఎక్కువగా పర్యాటకులు ఇక్కడ బస చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ రెస్టారెంట్ లో మరో ఆఫర్ కూడా ఉండండోయ్.. ఆఫర్స్ ఇవ్వడంతో పాటు లక్కీ డ్రా లతో ప్రత్యేక ఫ్యాకేజ్ ను ఇస్తున్నారు.. ఇంకా పిల్లలకు ఆటలు, మ్యూజిక్ ఉండటంతో ఎక్కువ మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు.. మీరు కూడా ఆ ప్రాంతానికి వెళితే ఆ రెస్టారెంట్ కు వెళ్లడం మర్చిపోకండి..