దివంగత వైఎస్ఆర్ పేరిట లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను ఏటా రెండు సార్లు ఇవ్వాలన్న కీలక నిర్ణయాన్ని ఏపీ కేబినెట్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్ అవార్డుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. అయితే.. నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. అయితే.. ఈ సమావేశంలో వైఎస్సార్ అవార్డులపై చర్చించిన కేబినెట్.. వైఎస్సార్ అవార్డులకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసింది ప్రభుత్వం. వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్, వైఎస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డులను ఇవ్వనుంది ప్రభుత్వం. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేయనుంది ఈ స్క్రీనింగ్ కమిటీ. కమిటీ సభ్యులుగా ప్రభుత్వ సలహాదారులు సజ్జల, జీవీడీ కృష్ణ మోహన్, దేవులపల్లి అమర్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
Also Read : Top Headlines @1PM : టాప్ న్యూస్
ఇదిలా ఉంటే.. గతేడాది.. వ్యవసాయం, కళలు-సంస్కృతి, సాహిత్యం, మహిళా, శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమ రంగాల్లో విశేషకృషి చేసిన 35 మంది వ్యక్తులు, సంస్థలకు 30 అవార్డులను అందజేశారు. ఇందులో 20 వైఎస్సార్ జీవిత సాఫల్య, 10 వైఎస్సార్ సాఫల్య పురస్కారాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాల తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘వైఎస్సార్’ అవార్డులను అందజేస్తోంది.
Also Read : BJP Vishnuvardhan Reddy : రేపు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్న పురందేశ్వరి