New Scorpion : ఎనిమిది కళ్లు, ఎనిమిది కాళ్లు.. కొత్త జాతి విషపు తేలును చూసి ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Scorpion : ఈ భూమిపై కొన్ని వేల, లక్షల జాతుల జంతువులు కనిపిస్తాయి. వాటిలో చాలా వాటి గురించి తెలిసి ఉండవచ్చు. అయితే మీరు కొన్ని జాతులకు చెందిన జీవులను చూడని లేదా పేర్లుకు కూడా వినని అనేక ఇతర జంతువులు ఉంటాయి. అయితే, కొన్నిసార్లు అలాంటి కొన్ని జీవులు అకస్మాత్తుగా కనిపిస్తాయి. ఇలాంటివి శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి ఒక వింత జీవి నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది శాస్త్రవేత్తలను కూడా ఆలోచించేలా చేసింది. మీరు తేళ్లను చూసి ఉంటారు, అయితే 8 కళ్ళు, 8 కాళ్ళు ఉన్న తేలును ఎప్పుడైనా చూసారా?
Read Also:Kodali Nani : అంబేద్కర్ దిక్సూచిగానే వైఎస్సార్‌సీపీ పని చేస్తుంది
Also Read
థాయిలాండ్‌లోని ఫేట్‌చబురి ప్రావిన్స్‌లోని కెంగ్ క్రాచన్ నేషనల్ పార్క్‌లో తాము కొత్త జాతి తేలును కనుగొన్నామని.. దీనికి ఎనిమిది కళ్లు, ఎనిమిది కాళ్లు ఉన్నాయని పరిశోధకుల బృందం పేర్కొంది. ఈ కొత్త జాతి మూడు మగ , ఒక ఆడ తేళ్లు రాతి కింద దాగి ఉన్న వాటి నమూనాల ఆధారంగా వివరించబడింది. వాటికి ఎక్కువ కళ్ళు, కాళ్ళు ఉన్నప్పటికీ.. అవి సాధారణ తేళ్ల కంటే చిన్నవిగా ఉంటాయి. ఈ కొత్త జాతి తేలును యూస్కార్పియోప్స్ ఉపజాతి లోపల ఉంచారు. శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్న థాయ్‌లాండ్‌లోని జాతీయ ఉద్యానవనం పేరు మీద యూస్కార్పియోప్స్ క్రాచన్ అని పేరు పెట్టారు.
Read Also:NBK110: బాలయ్య- బోయపాటి కాంబో రిపీట్ .. థియేటర్లు దద్దరిల్లాల్సిందే ..
శాస్త్రవేత్తలు కైంగ్ క్రాచన్ నేషనల్ పార్క్‌లో వన్యప్రాణుల కోసం వెతుకుతున్నారు. ఇంతలో వారు రాళ్ల క్రింద దాక్కున్న గోధుమ రంగు, వెంట్రుకల జీవిని చూశారు. ఈ స్కార్పియన్స్ రంగు ఖచ్చితంగా రాతి రంగు లాగా ఉంది. కాబట్టి మొదటి చూపులో రాక్, తేళ్ల మధ్య తేడాను గుర్తించడం కష్టంగా ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. తొలుత ఆ తేళ్లను చూసిన శాస్త్రవేత్తలు.. ఏదో జీవి ఆహారం వెతుక్కుంటూ వెళుతోందని భావించి.. దాని దగ్గరికి వెళ్లి నిశితంగా పరిశీలించగా.. అది తన నలుగురు పిల్లలను ఎత్తుకుని వెళ్తున్న ఆడ తేలు అని తెలిసింది. ఈ కొత్త జాతి తేళ్లు ఒక అంగుళం పొడవుతో పాటు చర్మంపై వెంట్రుకలను కూడా కలిగి ఉంటాయి. అయితే వాటిలో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే వాటికి ఎనిమిది కళ్లు, ఎనిమిది కాళ్లు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. దీనికి సంబంధించిన నివేదిక ఇటీవల జూటాక్సా జర్నల్‌లో ప్రచురితమైంది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!