NTV Telugu Site icon

Virovore : వైరస్‌లను తినే జీవి వైరోవోర్.. శాస్త్రవేత్తల ఆవిష్కరణ

Virus

Virus

Virovore : ప్రపంచంలో చైనా వంటి దేశాలు ఎన్ని వైరసులను సృష్టించినా ఏం భయపడాల్సిన పని లేదు. కరోనా కాదు కాదా వాళ్ల అమ్మలాంటి వైరస్ వచ్చిన పరపర నమిలి పారేసే కొత్త జీవిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. యునైటెడ్ స్టేట్స్‌లోని నెబ్రాస్కా-లింకన్ విశ్వవిద్యాలయానికి చెందిన మైక్రోబయాలజిస్ట్ జాన్ డెలాంగ్, అతని బృందం ఈ జీవిని కనుగొనడంతో పురోగతిని సాధించింది. వైరస్‌లను తినే మొట్టమొదటి ‘వైరోవోర్’ను కనిపెట్టారు. న్యూట్లాస్ అనే సైన్స్ మ్యాగజైన్ ప్రకారం, నెబ్రాస్కా-లింకన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు జాన్ డెలాంగ్, ఏదైనా సూక్ష్మజీవులు వైరస్‌లను చురుకుగా తింటున్నాయో లేదో తెలుసుకోవాలనుకున్నారు.. అలాంటి ఆహారం వాటి శారీరక పెరుగుదలకు తోడ్పడుతుందా లేదా అని కనుగొనాలనుకున్నారు.

Read Also:Gudivada Amarnath: పవన్‌కు మంత్రి ఆఫర్‌.. ‘సీఎం పవన్ కళ్యాణ్’ పేరుతో సినిమా తీస్తే నేనే ప్రొడక్షన్ చేస్తా..

ప్రపంచవ్యాప్తంగా మంచినీటినిలో ఉండే మైక్రోస్కోపిక్ సిలియేట్‌లు – హాల్టేరియా జాతికి చెందిన జీవులు అధిక సంఖ్యలో ఇన్ఫెక్షియస్ క్లోరోవైరస్‌లను తింటున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వైరోవోర్లు కేవలం వైరస్ లనే ఆహారంగా తీసుకుంటున్నాయని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. వీటి శరీరంలో న్యూక్లియిక్ ఆమ్లాలు, చాలా వరకు నైట్రోజన్, ఫాస్పరస్ ఉంటాయని చెప్పారు. ఈ వైరోవర్ ఇప్పుడు శాకాహారం, మాంసాహారాల్లో ఉంటుందని గుర్తించారు. దాని జీవిత చక్రం, కార్బన్ సైకిల్ పై పూర్తిస్థాయిలో ప్రయోగాలు జరపాలని పరిశోధకులు ప్లాన్ చేస్తున్నారు.