కొన్ని యాదృచ్చికంగా జరిగే సంఘటనల కారణంగా, లేదా కుటుంబ కారణాల వల్లనో కొందరు బిక్షగాళ్లుగా మారుతారు.. ఇక వాళ్లు బిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బులతో కడుపు నింపుకుంటున్నారు.. అయితే కొందరిని చూస్తే మానవత్వం ఉన్న వారికి గుండె తరుక్కుపోతుంది.. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. యాచించే స్థితికి చేరుకుంటే ఆ జీవితం చాలా దారుణంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే వారిని అసహ్యించుకునే ప్రజలే సమాజంలో ఎక్కువగా ఉంటారు.
కొందరు మాత్రం వారిని చూసి జాలిపడి డబ్బులను ఇస్తారు.. ఒక్కోసారి కొందరికి పనులు దొరక్క వీధుల్లో భిక్షాటన చేయాల్సిన దుస్థితి నెలకొంటుంది. వీరు సిటీ అంతా తిరుగుతూ తినడానికి పట్టెడు అన్నం పెట్టండి అని అడుక్కుంటుంటారు. అయితే ఇటీవల ఇలాంటి ఒక యాచకుడు ఓ స్కూల్ కు వెళ్లే అమ్మాయి కంట పడ్డాడు.. అతని ధీన స్థితిని చూసి ఆ చిన్నారి చలించి పోయింది.. అతడికి తన బాక్స్ లో ఉన్న ఫుడ్ అంతా ఇచ్చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది..
ఆ వీడియోను చూసిన చాలా మంది కన్నీరు పెట్టుకున్నారు.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో అమ్మాయి మొదట అతనికి డబ్బులను ఇస్తుంది.. ఆ తర్వాత అతను తినలేదని చెబితే తన లంచ్ బాక్స్ ను కూడా అతనికి ఇస్తుంది.. ఆపై తన చేతులతో బిచ్చగాడికి తినిపిస్తుంది. దాన్ని బట్టి ఆ చిన్నారి మనసు ఎంత స్వచ్ఛమైనదో అర్థం చేసుకోవచ్చు. ఈ బాలిక ప్రేమకు సదరు బిచ్చగాడు ఎమోషనల్ కంటతడి పెట్టుకున్నట్లు కనిపించింది.. ఈ వీడియోలో సీన్ సినిమా కన్నా ఎక్కువగా ఉంది. ఇది చూసిన వారంతా ఎమోషనల్ అవుతున్నారు..స్కూల్ డ్రెస్లో ఉన్న ఈ బాలిక తన లంచ్ కోసం తెచ్చుకున్న బాక్స్ను బ్యాగ్ లోంచి తీసి బిచ్చగాడికి ఇచ్చింది. తర్వాత బిచ్చగాడికి డబ్బు కూడా ఇస్తుంది. అతడికి ఫుడ్ తినిపించిన తర్వాత, తన వాటర్ బాటిల్ కూడా అతనితో పంచుకుంటుంది. స్కూల్ యూనిఫాంలో ఉన్న ఈ చిన్నారి తన మంచి మనసుతో నెటిజన్లను తెగ ఆకట్టుకుంది.. ఇలా అందరు ఆలోచిస్తే బాగుండు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి వీడియో వైరల్ అవుతుంది..