Site icon NTV Telugu

Ranga Reddy : గండిపేటలో స్కూల్ బస్సు బీభత్సం.. 18 మంది విద్యార్థులకు గాయాలు

School Bus

School Bus

Ranga Reddy : రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. గండిపేట లో ఇందు ఇంటర్నేషనల్ స్కూల్ కి చెందిన బస్ బీభత్సం సృష్టించింది. కోకాపేట సర్కిల్ వద్ద మోటర్ సైకిల్ ను స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. దీంతో స్థానికులు క్షతగాత్రుడిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలిపినట్లు సమాచారం. ఇదే ప్రమాదంలో బస్సు లో ప్రయాణిస్తున్న 18 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.

Read Also: Karepally : కారేపల్లి ఘటనపై పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి

మోటర్ సైకిల్ ను ఢీ కొట్టి కోకాపేట సర్కిల్ వద్ద ఉన్న రోటరీ లోకి స్కూల్ బస్సు దూసుకెళ్లింది. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు. గట్టిగా కేకలు వేశారు. వెంటనే వారిని హుటాహుటిన వేరే బస్సులలో యాజమాన్యం విద్యార్ధులను తరలించింది. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం గా నడపడం తోనే ప్రమాదం జరిగింది అని స్థానికులు అంటున్నారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు క్రేన్ సహాయం తో బస్సును పక్క కు తొలగించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో సింగరేణి అధికారులు.. రెండో రోజు పర్యటన

Exit mobile version