Site icon NTV Telugu

Balcony Collapse: ప్రైవేట్‌ పాఠశాలలో బాల్కనీ కూలి 40 మంది చిన్నారులకు గాయాలు..

School

School

Balcony Collapse: ఉత్తరప్రదేశ్‌ లోని బారాబంకి జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి అవధ్ అకాడమీ స్కూల్ బాల్కనీ కూలిపోవడంతో 40 మంది చిన్నారులు శిథిలాల కింద కూరుకుపోయి గాయపడ్డారు. ఉదయం 8 గంటలకు చిన్నారులు పాఠశాలలో ప్రార్థన సమయంలో ప్రార్థన చేసేందుకు తరలివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఐదుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిన్నారుల అరుపులు విని పాఠశాల చుట్టుపక్కల ప్రజలు పరుగులు తీశారు. ప్రజలు పిల్లలను కాపాడి పోలీసులకు సమాచారం అందించారు.

Akash: పెళ్ళి పీటలు ఎక్కబోతున్న మరో హీరోయిన్.. ఎవరంటే..?

ఈ పాఠశాలలో 400 మంది పిల్లలు చదువుతున్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు. తరగతులు గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో జరుగుతాయి. మొదటి అంతస్తు నుంచి కిందకు రావాలంటే బాల్కనీ గుండా రావాలి. పక్కనే మెట్లున్నాయి. పిల్లలు బాల్కనీలో ఉండగా బరువు పెరిగి 15 అడుగుల కింద పడిపోయారు. పిల్లలందరినీ సమీప ఆసుపత్రిలో చేర్చారు. పాఠశాల యాజమాన్యాన్ని అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version