మీరు రాత్రిపూట టాయిలెట్‌కి వెళ్లి అకస్మాత్తుగా ఎవరైనా మీ వెనుక నిలబడితే ఎలా ఉంటుంది.. ఒక్కసారి ఊహించుకోండి. ఒక్కసారి ప్రాణాలు పోయేంత పని అవుతుంది. నిజంగానే గుండె సమస్యలు ఉన్నట్లైతే ప్రాణాలు కూడా పోవచ్చు. మాములుగా ఒంటరిగా హర్రర్ సినిమాలు చూస్తేనే.. కింది నుండి కారిపోతుంది. అలాంటిది చీకటి గదిలోకానీ, టాయిలెట్లలో ఏదో ఒక భయంకరమైన రూపం ఉంటే చాలా భయపడిపోతాం. అయితే ఇప్పుడు.. అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి టాయిలెట్‌కు వెళతాడు. అందులో దెయ్యం రూపంలో భయంకరంగా ఓ వ్యక్తి ఉంటాడు. అది ఊహించని ఆ వ్యక్తి.. టాయిలెట్ లోకి వెళ్లి దాన్ని చూసి భయపడతాడు.
Viral Video: భారీ అనకొండను ఎలా పట్టుకున్నాడో చూడండి.. చూస్తే గుండె గుబేలే..!
ఈ వీడియోలో.. ఒక వ్యక్తి రాత్రిపూట టాయిలెట్‌లోకి వెళ్తుండటాన్ని చూడవచ్చు. అక్కడ తెల్లటి దుస్తులు చుట్టుకొని దెయ్యం రూపంలో తలుపు చాటుకుని నిలబడి ఉంది. అందులోకి వెళ్లిన వ్యక్తికి.. తన వెనుక ఎవరో నిలబడి ఉన్నారని తెలియదు. కొంత సమయం తర్వాత.. దెయ్యం అతని దగ్గరికి వెళ్లి ఏదో చెప్పాలని చూస్తుండగా.. ఆ వ్యక్తి దాని వైపు చూస్తాడు. ఇంకేముంది.. దానిని చూసిన వ్యక్తికి గుండె ఆగినంత పని అవుతుంది. భయం భయంగా ఎటు వెళ్లాలో అర్ధంకాక.. దానిని చూసి అరుస్తాడు. ఆ అరుపులకు దెయ్యం కూడా భయపడుతుంది.
Israel- Hamas War: ఇజ్రాయెల్ ప్రజల కిడ్నాప్.. అల్-షిఫా ఆస్పత్రిలో దాచిన వీడియో వైరల్
అయితే టాయిలెట్ లో నుండి పారిపోవడానికి దెయ్యం ప్రయత్నించడం వీడియోలో చూడవచ్చు. కానీ ఆ వ్యక్తి దెయ్యాన్ని పట్టుకుని చితకబాదడానికి ప్రయత్నిస్తాడు. కానీ దెయ్యం చివరకు తప్పించుకుంటుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. కానీ ఈ వీడియో ప్రాంక్.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు.. ‘ఎవరితోనూ ఇలా జోక్ చేయవద్దు. మితిమీరిన భయము కారణంగా, గుండెపోటుకు గురవుతారు. మీరు జోక్ చేస్తున్నారు. కానీ అవతలి వ్యక్తికి ఈ విషయం తెలియదు. మీ జోక్ ప్రాణాంతకం కావచ్చు. అని తెలిపాడు. మరో వినియోగదారు ‘ఈ ఇద్దరూ కలిసి చాలా భయపెట్టారు’ అని అన్నారు. అయితే ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఇప్పటి వరకు లక్షల మంది చూశారు.