NTV Telugu Site icon

SBI WhatsApp Service: ఎస్‌బీఐ వాట్సాప్‌ సర్వీసులు.. బ్యాంక్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా 15కు పైగా సేవలు!

Sbi Whatsapp Service

Sbi Whatsapp Service

How to Register and Check Balance on SBI WhatsApp Service: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం బాగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్ లేనిది చిన్న పని కూడా అవ్వడం లేదు. ఇక స్మార్ట్‌ఫోన్‌లో ప్రతిఒక్కరూ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ‘వాట్సాప్‌’ను వినియోగిస్తున్నారు. అందుకే దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా’ (ఎస్‌బీఐ) తమ ఖాతాదారులకు బ్యాంకింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు వాట్సాప్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంక్‌ వద్దకు వెళ్లాల్సిన పనిలేకుండా.. వాట్సాప్ ద్వారానే అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్‌ లాంటి 15కు పైగా సేవలను ఇంట్లోనే చూసుకోవచ్చు.

ఎస్‌బీఐ వాట్సాప్‌ సేవలు పొందాలంటే ముందుగా రిజిస్టర్‌ అవ్వాలి. దీనికోసం ఎస్‌బీఐ బ్యాంక్‌ ఖాతాకు లింక్ చేసిన నంబర్‌ నుంచి ఎస్ఎంఎస్ పంపాలి. ‘WAREG’ అని టైప్‌ చేసి, ఆపై స్పేస్‌ ఇచ్చి అకౌంట్‌ నంబర్‌ను (WAREG XXXXX5439) టైప్‌ చేసి.. 72089 33148 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపాలి. అపుడు మొబైల్‌ నంబర్‌కు కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ వస్తుంది. ఇక వాట్సాప్‌ ద్వారా ఎస్‌బీఐ సేవలు పొందవచ్చు. దీనికోసం 9022690226 నంబర్‌ను మీ ఫోన్లో సేవ్‌ చేసుకోవాలి. చాట్‌ బాక్స్‌లోకి వెళ్లి హయ్ అని మెసేజ్‌ చేయాలి. అనంతరం మీ మొబైల్ స్క్రీన్‌పై క్షనిపించే సూచనల ఆధారంగా మీకు అవసరమైన సమాచారాన్ని పొందొచ్చు. వాట్సాప్ ద్వారా ఎస్‌బీఐ ఏ సేవలు అందిస్తుందో ఓసారి చూద్దాం.

బ్యాంక్‌ హాలిడేస్‌:
బ్యాంకు సెలవు దినాలు వాట్సాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. మీ స్టేట్, డేట్ వివరాలు ఎంటర్ చేస్తే హాలిడేస్‌ వివరాలు వస్తాయి.

బ్యాంక్‌ బ్యాలెన్స్‌:
సేవింగ్స్‌, కరెంట్‌ అకౌంట్‌ ఏ ఖాతా వారైనా బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

మినీ స్టేట్‌మెంట్‌:
చివరి 10 ట్రాన్షాక్షన్స్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.

అకౌంట్‌ స్టేట్‌మెంట్‌:
చివరి 250 ట్రాన్షాక్షన్స్ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ రూపంలో పొందొచ్చు.

ఇతర స్టేట్‌మెంట్‌లు:
హోమ్‌, ఎడ్యుకేషన్‌, ఇంట్రస్ట్‌ సర్టిఫికెట్‌ పొందొచ్చు.

రుణ వివరాలు:
వాహన, గృహ, వ్యక్తిగత రుణాలతో పాటు గోల్డ్‌, ఎడ్యుకేషన్‌ లోన్‌ అందించే అన్ని రుణ సంబంధిత ప్రశ్నలు, రుణ రేట్లు వంటి వివరాలు పొందొచ్చు.

డిపాజిట్‌ వివరాలు:
సేవింగ్‌ ఖాతా, రికరింగ్‌ డిపాజిట్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, టర్మ్‌ డిపాజిట్‌తో పాటు బ్యాంక్ అందించే అన్ని డిపాజిట్ల వివరాలు, వడ్డీ రేట్లు తెలుసుకోవచ్చు.

పెన్షన్ స్లిప్:
రిటైర్మెంట్ ఉద్యోగులు పెన్షన్‌ స్లిప్‌లు తీసుకోవచ్చు.

ఎన్‌ఆర్‌ఐ సేవలు:
ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా వాట్సాప్ ద్వారా ఎస్‌బీఐ సేవలు పొందొచ్చు.

ఏటీఎం సేవలు:
మనకు దగ్గర్లో ఎస్‌బీఐ ఏటీఎంలు ఉన్నాయో తెలుసుకోవచ్చు.

ఇన్‌స్టా సేవింగ్ అకౌంట్‌:
18 సంవత్సరాల వయసు నిండిన వారు వాట్సాప్ సాయంతో ఇన్‌స్టా సేవింగ్ ఖాతా తెరవచ్చు.

Also Read: IND vs PAK: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. 10 సెకన్లకు 30 లక్షలు!

ప్రీ అప్రూవ్డ్‌ లోన్లు:
మీ ఖాతాపై అందుబాటులోఉన్న ప్రీ అప్రూవ్డ్‌ పర్సనల్‌ లోన్‌, కార్‌ లోన్‌, టూ వీలర్‌ లోన్‌ వివరాలు తెలుస్కోవచ్చు.

బ్యాంక్‌ ఫారాలు:
డిపాజిట్‌, విత్‌డ్రా ఫారాలను సైతం వాట్సాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

డెబిట్‌ సేవలు:
డెబిట్ కార్డ్‌ వినియోగ వివరాలు, లావాదేవీల హిస్టరీతో పాటు దానికి సంబంధించిన అన్ని వివరాలు పొందవచ్చు.

కాంటాక్టులు, హెల్ప్‌లైన్‌ నంబర్లు:
ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవల్లో ఏదైనా సమస్య ఉంటే.. వాటి పరిష్కారానికి కావాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లను పొందొచ్చు.

లావాదేవీల నిలిపివేత:
కార్డ్‌ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా వెంటనే లావాదేవీలను నిలిపివేయటం లేదా బ్లాక్ చేయటం వంటి సర్వీసులనూ వాట్సాప్ ద్వారా చేయొచ్చు.

Also Read: Made in Heaven 2 OTT: ఓటీటీలోకి శోభిత ధూళిపాళ ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌ 2’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Show comments