మనం సంపాదించిన సొమ్మును పిల్లల పేరు మీద వేస్తాము.. వారి భవిష్యత్ కోసం డబ్బులు కావాలని ముందు నుంచే జాగ్రత్త పడతాము.. పిల్లల కోసం ప్రత్యేక పొదుపు పథకాలలో ఇన్వెస్ట్ చేస్తాము.. అధిక రాబడి పొందేలా ప్రముఖ బ్యాంక్ ఎస్బిఐ అదిరిపోయే స్కీమ్ ను తీసుకొచ్చింది.. ఆ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు మూడింతలు పెరుగుతుంది..ఆ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఫండ్ ప్రారంభించిన సమయంలో రూ. 10 లక్షల పెట్టుబడి పెడితే దాని విలువ ప్రస్తుతం రూ. 30.10 లక్షలకు పెరిగింది. ఎస్ అండ్ పీ బీఎస్‌ఈ సెన్సెక్స్ టీఆర్‌ఐలో అదే పెట్టుబడి కేవలం రూ.18.06 లక్షలు మాత్రమే. ఎస్‌బీఐ మాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ కూడా గత మూడు సంవత్సరాల్లో ఎస్‌ఐపీ పెట్టుబడులకు గణనీయమైన రాబడిని ఇచ్చింది. ఉదాహరణకు ఈ పథకంలో 3 సంవత్సరాల పాటు నెలవారీ రూ. 10,000 ఎస్‌ఐపీ మీ మొత్తం పెట్టుబడిని రూ.5.41 లక్షలుగా మార్చింది. మీరు మీ ఎస్‌ఐపీ పెట్టుబడిపై రూ. 1.81 లేదా 50 శాతం కంటే ఎక్కువ లాభాన్ని పొందుతారు..
ఇకపోతే ఈ ఫండ్ అనేది దీర్ఘకాలిక మూలధన కోసం రూపొందించిన ఓపెన్ ఎండెడ్ పథకం. మ్యూచువల్ ఫండ్ అంటే ప్రధానంగా ఈక్విటీ, ఈక్విటీ-సంబంధిత సెక్యూరిటీలలో అనేక రంగాలు మరియు మార్కెట్ క్యాపిటలైజేషన్లలో పెట్టుబడి పెడుతుంది. ఇది ఆదాయాన్ని సంపాదించడానికి డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడి పెడుతుంది. ఈ ప్లాన్‌కు ఐదేళ్ల కంటే తక్కువ లేదా బిడ్డ మేజర్ అయ్యే వరకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది.. బిడ్డ మెచ్యూర్ అయ్యే వరకు కూడా ఉంటుంది.. మీరు డబ్బులను ఇన్వెస్ట్ చేసే కొద్ది ఆదాయం కూడా పెరుగుతూ వస్తుంది..ఆగస్ట్ 31, 2023న ఈ ఫండ్‌కు సంబంధించిన ఏయూఎం రూ. 1,182.26 కోట్లుగా నమోదైంది. ప్రత్యేకంగా ఏయూఎం దేశీయ, విదేశీ సెక్యూరిటీలను కలిగి ఉన్న 29 కంపెనీల్లో మాత్రమే విస్తరించి ఉంది… ఈ పథకం కోసం మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే దగ్గరలోని మెయిన్ బ్రాంచ్ ను సందర్శించాలి..