NTV Telugu Site icon

SBI Recruitment 2023 : SBI లో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

Sbi

Sbi

ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన ద్వారా మొత్తం 42 ఖాళీలను భర్తీ చేయనున్నారు అర్హతలు, ఆసక్తి కలిగిన వాళ్లు వెంటనే అప్లై చేసుకోండి.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం…

ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 27గా నిర్ణయించారు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.sbi.co.in ను పరిశీలించి ఆయా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు..

పోస్ట్ వివరాలు..

మొత్తం 42 పోస్టులను భర్తీ చేస్తారు. భర్తీ చేయనున్న ఖాళీలలో డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ) / మేనేజ్‌మెంట్ (సెక్యూరిటీ) ఉన్నాయి.

అర్హతలు..

గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూషన్ నుండి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు..

వయస్సు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు వారి కనీస వయస్సు 25 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 40 సంవత్సరాల మధ్య ఉండాలి..

అప్లికేషన్ ఫీజు..

జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.750. SC/ST/PWBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది..

ఇంటర్వ్యూ ప్రక్రియ..

ఈ పోస్టులకు ఇంటర్వ్యూ,డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు..

ఎలా అప్లై చేసుకోవాలంటే?

అధికారిక వెబ్‌సైట్‌ sbi.co.in ను ఓపెన్ చేయాలి.
నోటిఫికేషన్ బటన్‌పై క్లిక్ చేయాలి.
ముందుగా సూచనలు, నియమాలు చదివి, దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి సబ్ మిట్ చేయాలి. తరువాత ప్రత్యేక ఐడి జనరేట్ అవుతుంది.
అనతరం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
భవిష్యత్ అవసరాలకోసం అప్లికేషన్ ఫీజు పేమెంట్ వివరాలను డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ అవుట్ తీసుకొవాలి..

ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన వారంతా నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..

Show comments