తక్కువ సంపాదించే వాళ్లు కాదు.. తక్కువ పొదుపు చేసే వాళ్లు పేదవాళ్లు అని నిపుణులు అంటుంటారు. నేడు మీరు మీ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని సేవ్ చేస్తే రాబోయే రోజుల్లో ఆపదలు సంభవించినప్పుడు, ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో పొదుపు చేసిన డబ్బు ఆదుకుంటుంది. అదే సమయంలో ఇన్సూరెన్స్ పాలసీల్లో చేరితే దురదృష్టావశాత్తు ఏదైనా ప్రమాదం భారిన పడినప్పుడు ఇన్సూరెన్స్ సొమ్ము కుటుంబానికి అండగా ఉంటుంది. అప్పుల బాధ లేకుండా చేస్తుంది. మరి మీరు కూడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన ప్రమాద బీమా పథకాన్ని అందిస్తోంది. అదే SBI వ్యక్తిగత ప్రమాద బీమా పథకం. ఇందులో చేరి రోజుకు రూ. 6 పొదుపు చేస్తే చాలు రూ. 40 లక్షలు పొందే ఛాన్స్ ఉంటుంది.
Also Read:AP Cabinet Decisions: 80 వేల కోట్ల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్.. లక్షకు పైగా ఉద్యోగాలు..!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు రకాల ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తోంది. అందులో ఒకటి PAI (Personal Accident Insurance). ఇందులో వంద రూపాయల నుంచి 2 వేల రూపాయల వరకు బీమా పాలసీలు ఉన్నాయి. ఈ వ్యక్తిగత ప్రమాద బీమాలో పలు రకాల స్లాబులు ఉన్నాయి. అయితే వీటిలో ఏడాదికి రూ. 2 వేల (అంటే రోజుకు రూ. 6 చొప్పున) ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే వారు ప్రమాద వశాత్తూ మరణిస్తే, నామినీకి 40 లక్షల రూపాయలు చెల్లిస్తారు.
Also Read:Illegal immigrants: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. భారత్‌పై హక్కుల సంస్థ ఆరోపణలు..
అర్హులు ఎవరు?
ప్రమాదాల్లో సంభవించిన మరణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. సహజ మరణాలను, అనారోగ్య మరణాలను లెక్కలోకి తీసుకోరు. రోడ్డు ప్రమాదాలు, కరెంట్ షాక్, వరదలు, భూకంపాలు, పాము, తేలు కాటు ద్వారా సంభవించే ప్రమాద మరణాలకు మాత్రమే బీమా వర్తిస్తుంది. ఈ బీమాలో చేరడానికి 18 నుంచి 65 ఏళ్ల వయసున్న వారు అర్హులు. పాలసీ క్లెయిమ్ చేసుకోవడానికి మరణం సంభవించిన 90 రోజుల్లోపు వివరాలను బీమా కంపెనీకి నామినీ తెలియజేయాలి. ఘటన జరిగిన 180 రోజుల్లోపు సంబంధిత పత్రాలన్నీ సమర్పించాలి. ఒకవేళ పాలసీదారు ఈ పాలసీని రద్దు చేసుకోవాలని భావిస్తే, లిఖిత పూర్వకంగా నోటిసు ఇస్తే 15 రోజుల్లో పాలసీని రద్దు చేస్తారు. ఈ పాలసీ తీసుకోవాలని భావించేవారు తమ దగ్గరలోని ఎస్బీఐ బ్రాంచ్‌కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుని పాలసీలో చేరొచ్చు.
