ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నెన్నో కొత్త పథకాలను ప్రవేశ పెడుతుంది.. తాజాగా రైతులకు శుభవార్త చెబుతుంది.. రైతులకు ప్రత్యేకమైన సేవలు అందిస్తోంది.. కేవలం బ్యాంక్ కు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు మూడు లక్షలు ఇచ్చేస్తుంది.. అవునా?.. నిజామా? ఎలా మూడు లక్షలు పొందవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం..
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్‌ను తీసుకువచ్చింది. మీరు ఎస్‌బీఐ సహా మరే ఇతర బ్యాంక్‌కు వెళ్లి అయినా ఈ స్కీమ్ కింద అకౌంట్ తెరవొచ్చు. ఈ కార్డు స్కీమ్ కింద బ్యాంక్‌కు వెళ్లి ఖాతా తెరిస్తే.. రైతులకు రూ. 3 లక్షల వరకు రుణం లభిస్తుంది. తక్కువ వడ్డీ రేటుకే రుణాలు పొందొచ్చు. తీసుకున్న రుణాన్ని సరైన సమయానికి చెల్లిస్తూ వస్తే.. వడ్డీ రేటు 3 శాతం తగ్గుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ టెన్యూర్ ఐదేళ్లు. లోన్ మొత్తాన్ని ప్రతి ఏటా 10 శాతం చొప్పున పెంచకుంటూ వస్తారు. అంతేకాకుండా కేసీసీ రుణ గ్రహాతలకు రూపే డెబిట్ కార్డులను కూడా అందిస్తుంది..
అదే విధంగా.. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన కింద ఇన్సూరెన్స్ పొందొచ్చు. ప్రీమియం చెల్లించాలి. అలాగే రూపే కార్డు కలిగిన వారు ప్రమాద బీమా కింద రూ. 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పొలం పట్టా వంటి పత్రాలు అవసరం అవుతుంది.రూ. 3 లక్షల వరకు రుణ మొత్తానికి అయితే 7 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. రూ. 3 లక్షలకు పైన అయితే వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. రూ. 3 లక్షల వరకు లోన్‌పై అయితే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. రైతులు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండా యోనో యాప్ ద్వారా కూడా కేసీసీ లోన్ పొందొచ్చు.. రైతులు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు..అప్పుడు కేవలం 4 శాతం వడ్డీ రేటుకే రైతులకు రూ. 3 లక్షల వరకు రుణం లభిస్తుంది. అందుకే అన్నదాతలు ఈ ఛాన్స్ ఉపయోగించుకోవచ్చు ఇక కస్టమర్ల కోసం ప్రత్యేకమైన ఆఫర్స్ ను కూడా అందిస్తుంది..