సొంతింటి కల చాలా మందికి ఉంటుంది.. ఈరోజుల్లో సొంతిల్లు కొనాలేనుకొనేవారికి ఫైనాన్సియల్ సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాల్సిందే.. తమ వద్ద ఉన్న సొమ్మును డౌన్ పేమెంట్ గా చెల్లించి మిగిలిన మొత్తాన్ని హోమ్ లోన్ తీసుకుంటున్నారు.. ఏ బ్యాంక్ లో వడ్డీ తక్కువగా ఉందో తెలుసుకొని తీసుకోవడం మంచిది.. లేకుంటే మాత్రం వడ్డీ మోపెడు అవుతుంది..
హోమ్ లోన్ తీసుకొనేవారికి ప్రముఖ దేశీయ బ్యాంక్ ఎస్బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. గృహ రుణాలపై పండగ వేళ అద్భుత ఆఫర్ ప్రకటించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హోమ్ లోన్ కస్టమర్లకు వడ్డీ రేట్లపై భారీ రాయితీ ఇచ్చి అట్రాక్ట్ చేస్తోంది. సాధారణంగా పండగ సమయంలో కొత్త ఇల్లు, వాహనాలు కొనుగోలు చేస్తుంటారు జనం. మరీ ముఖ్యంగా దసరా, దీపావళి సీజన్ లో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంటుంది..
ఈ క్రమంలో కస్టమర్లను ఆకట్టుకొనేలా బెస్ట్ ఆఫర్ తీసుకొచ్చింది ఎస్బీఐ. పండగ వేళ హోమ్ లోన్ల కోసం చూసే వారి కోసం ఎస్‌బీఐ ఇప్పటికే ఒక స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. వడ్డీ రేట్లను వారికి భారీ స్థాయిలో తగ్గించింది.. ఈ తగ్గింపు అనేది హోమ్ లోన్ తీసుకునే కస్టమర్ సిబిల్ స్కోరుపై ఆధారపడి ఉంటుంది. ఈ రాయితీ రెగ్యులర్ హోం లోన్, ఫ్లెక్సీపే, ఎన్‌ఆర్‌ఐ, నాన్ శాలరీడ్, ప్రివిలేజ్, అపాన్ ఘర్‌కు వర్తిస్తుంది.. ఇకపోతే ఈ ఆఫర్స్ లో భాగంగా కార్ లోన్, పర్సనల్ లోన్ తో పాటు మిగిలిన లోన్స్ తీసుకొనేవారికి ప్రాసేసింగ్ ఫీ అనేది లేదు..
ఓ వ్యక్తి సిబిల్ స్కోరు 750-800 మధ్య ఉందనుకోండి.. వారికి ఈ ఆఫర్ సమయంలో హోమ్ లోన్లపై వడ్డీ రేటులో 55 బేసిస్ పాయింట్ల మేర రాయితీ వస్తుంది. అంటే ఇక్కడ 8.60 శాతం వడ్డీకే హోమ్ లోన్ పొందొచ్చన్నమాట. సిబిల్ స్కోరు 700-749 మధ్య ఉన్నవారికి ఈ ఆఫర్ పీరియడ్‌లో 8.70 శాతానికి హోమ్ లోన్ వస్తుంది.. అదే విధంగా 500 లోపు సిబిల్ స్కోర్ ఉంటే వారికి నో ప్రాసేసింగ్ ఫీ కింద లోన్ తీసుకోవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు మీకు అవసరమైన లోన్ ను పొందెందుకు బ్యాంకుకు వెళ్ళండి..