స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతిపెద్ద బ్యాంకు. లక్షలాది మంది కస్టమర్లకు ఎస్బీఐ బిగ్ షాకిచ్చింది. ఎస్బీఐ ATM, ఆటోమేటెడ్ డిపాజిట్-కమ్-విత్‌డ్రావల్ మెషిన్ (ADWM) లావాదేవీ ఛార్జీలను సవరించింది. జీతం ఖాతాదారులకు అందించే అపరిమిత సేవను కూడా బ్యాంక్ నిలిపివేసింది. ఇంటర్‌చేంజ్ ఫీజులతో సహా ATM సేవల ధరలను SBI సమీక్షించింది. ఇంటర్‌చేంజ్ ఫీజులు అంటే బ్యాంకులు మరొక బ్యాంకు ATMని ఉపయోగించినందుకు చెల్లించే ఛార్జీలు. సవరణ తర్వాత ఈ ఫీజులను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో, SBI ఫిబ్రవరి 2025లో అనేక కేటగిరీలలో ట్రాన్సాక్షన్ ఛార్జీలను పెంచింది.
Also Read:Iran protests: “అమెరికన్లు వెంటనే ఇరాన్‌ను వదిలేయండి”.. దాడికి సిద్ధమైన యూఎస్..!
SBI యేతర ATMలలో లావాదేవీ ఛార్జీలను SBI పెంచింది. ఈ మార్పు డిసెంబర్ 1, 2025 నుండి అమలులోకి వచ్చాయి. కొత్త మార్పుల ప్రకారం, ఇప్పుడు ఉచిత పరిమితి తర్వాత, SBI కాని ATM నుండి నగదు ఉపసంహరించుకోవడానికి రూ. 23 ప్లస్ GST చెల్లించాల్సి ఉంటుంది. మీరు బ్యాలెన్స్ చెక్ లేదా మినీ స్టేట్‌మెంట్ వంటి ఆర్థికేతర లావాదేవీలు చేస్తే, మీరు దీనికి రూ.11 ప్లస్ GST చెల్లించాలి. గతంలో, ఈ సేవకు రూ.10 ప్లస్ GST ఖర్చయ్యేది.
మీకు SBIలో శాలరీ అకౌంట్ ఉంటే, ఇక నుండి మీరు SBI కాని ATMలలో అపరిమిత ఉచిత లావాదేవీల సౌకర్యాన్ని పొందలేరు. ఇప్పుడు, మీరు నెలకు 10 ఉచిత లావాదేవీలను మాత్రమే పొందుతారు. వాటిలో నగదు ఉపసంహరణలు, బ్యాలెన్స్ తనిఖీలు రెండూ ఉన్నాయి. ఉచిత పరిమితి అయిపోయిన తర్వాత, ఆర్థిక లావాదేవీలకు రూ.23, ఆర్థికేతర లావాదేవీలకు రూ.10, అదనంగా GST ఖర్చవుతుంది. సాధారణ పొదుపు ఖాతాదారులకు ఉచిత లావాదేవీల సంఖ్యలో ఎటువంటి మార్పు లేదు. మీరు ఇప్పటికీ SBI కాని ATMలలో నెలకు 5 ఉచిత లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర రెండూ) చేసుకోవచ్చు. అది మెట్రో అయినా లేదా నాన్ మెట్రో అయినా.
SBI సొంత ATMలలో SBI డెబిట్ కార్డును ఉపయోగించి లావాదేవీలు పూర్తిగా ఉచితం. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాదారులపై కొత్త ఛార్జీలు లేవు. కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) ఖాతాలు కలిగిన వినియోగదారులకు కూడా సవరించిన రుసుముల నుండి మినహాయింపు ఇచ్చారు. దీనితో పాటు, కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్స్ (యోనో క్యాష్) కూడా అపరిమితంగా, SBI ATMలలో ఉచితంగా పొందవచ్చు.
