Site icon NTV Telugu

Saudi Bus Accident: సౌదీ రోడ్డు ప్రమాదం.. రెండు కుటుంబాలకు చెందిన 15 మంది హైదరాబాదీలు మృతి..

Saudi Bus Tragedy

Saudi Bus Tragedy

Saudi Bus Accident: సౌదీ రోడ్డు ప్రమాదంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒక కుటుంబానికి చెందిన 8 మంది, మరో కుటుంబానికి చెందిన ఏడుగురు హైదరాబాదీలు సజీవదహనమయ్యారు.. మొదటి కుటుంబానికి చెందిన ఎనిమిది మందిలో షోయబ్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన ఏడుగురు చనిపోయినట్లుగా గుర్తించారు. పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు.. మహమ్మద్ అబ్దుల్ షోయబ్ చికిత్స పొందుతుండగా.. అతడి తండ్రి మహమ్మద్ అబ్దుల్ కధీర్, గౌసియా బేగం మృత్యువాత పడ్డారు. షోయబ్ తాత మహమ్మద్ మౌలానా (గౌసియా ఫాదర్), బంధువులు రహీమ్ ఉనిషా, రెహమత్ బి, మహమ్మద్ మన్సూర్ వీరితో పాటు మరొకరు సజీవదహనయ్యారు.
READ MORE: Akhanda2Thaandavam : అఖండ – 2.. జాజికాయ.. జాజికాయ.. నువ్వే నా ఆవకాయ..!

ఘటనా స్థలం నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో మరో కుటుంబానికి సంబంధించిన ఏడుగురు చనిపోయినట్టుగా భావిస్తున్నారు కుటుంబ సభ్యులు.. సెల్ఫోన్ కాల్స్‌కు ఏడుగురు స్పందించడం లేదు. ఘటన జరిగిన దగ్గర నుంచి అందుబాటులో లేరు. కాగా.. నవంబర్ 9న ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి 20 మంది.. ఫ్లై జోన్ నుంచి మరో 24 మంది మక్కాకు బయలుదేరారు. మక్కాలో దర్శనం తర్వాత 40మంది మదీనాకి బయలుదేరారు. నలుగురు మక్కలోనే ఉండిపోయారు. ఒకరు ప్రాణాలతో బయటపడగా మిగిలిన 39 మంది చనిపోయినట్లుగా భావిస్తున్నారు.

READ MORE: Ganja Seized: ట్రైన్ లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్స్.. పట్టుకున్న పోలీసులు

Exit mobile version