NTV Telugu Site icon

Mukaab: అద్భుత కట్టడాలకు కేరాఫ్ అరబ్ కంట్రీ.. వావ్ ఈ సారి డిజైన్ మామూలుగా లేదు

Mukaab

Mukaab

Mukaab: సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం. ఎన్నో అద్భుత కట్టడాలకు ఫేమస్. ఎటుచూసినా ఆకాశహర్మ్యాలు, భారీ నిర్మాణాలు, వెరైటీ ప్రాజెక్టులతో ఆశ్చర్యపరిచే ఆ దేశం. ఇటీవలే తాబేలు ఆకారంలో భారీ ఓడను నిర్మించేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. దాన్ని తేలియాడే నగరంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. దానికి ‘పాంజియోస్’ అని నామకరణం కూడా చేసింది. తాజాగా మరో అబ్బురపరిచే నిర్మాణానికి ఈ అరబ్‌ కంట్రీ రెడీ అవుతోంది. తాజాగా మరో అబ్బురపరిచే నిర్మాణానికి సౌదీ ప్లాన్ చేసింది. రాజధాని నగరం రియాద్ లో ‘ముకాబ్’ పేరుతో అతి భారీ కట్టడానికి డిజైన్ చేసింది. దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేసింది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆ అతి భారీ నిర్మాణం.. మక్కాలోని పవిత్ర ‘కాబా’ మాదిరి.. రియాద్ సిటీలో కనిపిస్తోంది.

Read Also: Pramod Muthalik: ముస్లిం అమ్మాయిలను ట్రాప్ చేయండి.. జాబ్, భద్రత కల్పిస్తా

సౌదీ విజన్ 2030 ప్రణాళికలో భాగంగా రియాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధునిక డౌన్‌టౌన్‌ను అభివృద్ధి చేయాలని సౌదీ అరేబియా లక్ష్యంగా పెట్టుకుంది. 19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడనుంది ఈ కొత్త ప్రాజెక్ట్. దాదాపు 400 మీటర్లు ఎత్తు ఉండనుంది. ఇది న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే 20 రెట్లు పెద్దది. 104,000 కంటే ఎక్కువ రెసిడెన్షియల్ యూనిట్లు, 9,000 హోటల్ గదులు. 980,000 sqm కంటే ఎక్కువ రిటైల్ స్పేస్‌తో పాటు 1.4 కంటే ఎక్కువ 25 మిలియన్ చదరపు మీటర్ల అంతస్తులో ఉండనుంది. ఇందులో మ్యూజియం, టెక్నాలజీ అండ్ డిజైన్ యూనివర్సిటీ, మల్టీ పర్పస్ థియేటర్, మరో 80కిపైగా కల్చరల్, ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు వంటివి ఏర్పాటు కానున్నాయి.