Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన

  • సౌదీపై హౌతీల దాడులు తీవ్రం
  • అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’
  • సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
Soudi1

Soudi1

సౌదీపై హౌతీల దాడులు తీవ్రమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. సౌదీలోని పౌరులకు భారత ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించింది. హౌతీ తిరుగుబాటుదారుల దాడుల నేపథ్యంలో సౌదీలోని భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సందర్భాల్లో ఇళ్లలోనే ఉండాలని సూచించింది.

సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో భారత పౌరులు స్థానిక అధికారుల సూచనలు పాటించాలని, అనవసరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎంబసీ సూచించింది. స్థానిక అధికారుల భద్రతా హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకూడదని, అత్యవసర పరిస్థితుల్లో అధికారిక మార్గదర్శకాలను అనుసరించాలని పేర్కొంది.