Site icon NTV Telugu

Saudi Bus Accident: సౌదీలో బస్సు తగులబడి 42 మంది మృతి.. మృతుల్లో మక్కాకు వెళ్లిన హైదరాబాదీలే అధికం..

Makka

Makka

Bus Accident: సౌదీ అరేబియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న భారతీయ యాత్రికులతో నిండిన బస్సు బదర్- మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే ట్యాంకర్‌లోని ఇంధనం ధాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తాజాగా సమాచారం ప్రకారం.. మక్కా నుంచి మదీనాకు భారతీయ యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు 40 మంది మృతి చెందినట్లు సమాచారం. యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ బృందం హైదరాబాద్‌కు చెందినదని చెబుతున్నారు. ఈ బృందంలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదం భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:30 గంటలకు జరిగింది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న ఉమ్రా యాత్రికులను బస్సు తీసుకెళ్తోంది. మదీనా నుంచి 160 కి.మీ దూరంలో ఉన్న ముహ్రాస్ అనే ప్రదేశంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఎంత మంది ఉన్నారనే దానిపై అధికారిక సమాచారం ఇంకా లభించలేదు. 11 మంది మహిళలు, 10 మంది పిల్లలు మరణించారని అనధికారిక సమాచారం. సివిల్ డిఫెన్స్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. దీని కారణంగా, మృతదేహాలను గుర్తించలేకపోయారు. ప్రమాదం నుంచి ఒకరు ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. ప్రస్తుతం, భారతీయ ఏజెన్సీలు, ఉమ్రా ఏజెన్సీలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి.

READ MORE: MLA MS Raju: బాలయ్య అభిమానిగా చెబుతున్నా.. ఆయన జోలికి వస్తే చర్మం ఒలిచేస్తా..! ఎమ్మెల్యే మాస్‌ వార్నింగ్..

Exit mobile version