Site icon NTV Telugu

Saudi Arab : సౌదీలో పోలీసుల కఠిన చర్యలు.. ఎవరైనా నేరం చేయాలంటే 10సార్లు ఆలోచించాల్సిందే

New Project (32)

New Project (32)

Saudi Arab : రియాద్ ప్రాంతంలోని హురేమిలా గవర్నరేట్‌లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉత్పత్తుల ఎక్స్ పైరీ డేట్లను మారుస్తున్న అక్రమ కార్మికులను సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ పట్టుకున్నట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ గురువారం నివేదించింది. ఆ తర్వాత మంత్రిత్వ శాఖ అక్రమ కార్మికులను అరెస్టు చేసింది. రియాద్ రీజియన్ పోలీసులు, హురేమిలా గవర్నరేట్ పోలీసుల సహకారంతో తెల్లవారుజామున 3 గంటలకు ఈ దాడి జరిగింది.

స్వాధీనం చేసుకున్న ఉత్పత్తులలో 8 గ్రాముల 248,000 చికెన్ స్టాక్ క్యూబ్‌లు, 4,600 పొటాటో చిప్ ఉత్పత్తులు, 2,900 సోయా సాస్‌లు, 1,500 పాస్తా సాస్‌లు ఉన్నాయి. అయితే, ఆ తర్వాత ఉత్పత్తులను ధ్వంసం చేయడంతోపాటు కొత్త గడువు తేదీలను ముద్రించేందుకు ఉపయోగించే లేజర్ పరికరాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also:CM Revanth Reddy: నేడు ధర్మపురి, సిరిసిల్ల, ఉప్పల్ ల్లో సీఎం రేవంత్ పర్యటన..

మూడు సంవత్సరాల జైలు శిక్ష
యాంటీ-కమర్షియల్ ఫ్రాడ్ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, 266,623డాలర్ల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. నివాసం, పని, సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు సౌదీ అధికారులు వారంలో 19,050 మందిని అరెస్టు చేసినట్లు ఏప్రిల్ 27 న ముందుగా సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలియజేసింది. నివాస చట్టాలను ఉల్లంఘించినందుకు మొత్తం 11,987 మందిని అరెస్టు చేయగా, అక్రమ సరిహద్దు దాటడానికి ప్రయత్నించినందుకు 4,367 మందిని అరెస్టు చేశారు. కార్మిక సంబంధిత సమస్యలపై 2,696 మందిని అరెస్టు చేశారు.

ఎంత మందిని అరెస్టు చేశారు
అక్రమంగా రాజ్యంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినందుకు అరెస్టయిన 1,011 మందిలో 61 శాతం మంది ఇథియోపియన్లు, 36 శాతం మంది యెమెన్, 3 శాతం మంది ఇతర దేశాలకు చెందిన వారని నివేదిక వెల్లడించింది. మిగిలిన 24 మంది పొరుగు దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, 18 మంది అక్రమార్కులను రవాణా చేయడంలో.. వారికి ఆశ్రయం కల్పించడంలో పాల్గొన్నందుకు పట్టుబడ్డారు. ఎవరైనా రవాణా, ఆశ్రయం కల్పిస్తే.. అలాగే రాజ్యంలోకి అక్రమంగా ప్రవేశించడాన్ని సులభతరం చేస్తే, గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష, 260,000డాలర్ల వరకు జరిమానా, అలాగే వాహనాలు,ఆస్తులను జప్తు చేయవచ్చని సౌదీ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.

Read Also:Congress: ఉత్కంఠకు తెర.. రాయ్‌బరేలీ, అమేథీ అభ్యర్థులు వీరే

Exit mobile version