Site icon NTV Telugu

Satyadev New Movie: అనిల్ రావిపూడి చేతుల మీదుగా సత్యదేవ్ కొత్త సినిమా ప్రారంభం..

Satyadev

Satyadev

Satyadev New Movie: రామానాయుడు స్టూడియోలో ఈ రోజు హీరో సత్యదేవ్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఫరియా అబ్దుల్లా నటిస్తుంది. లక్ష్మినారాయణ పుట్టంచెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై హీరో హీరోయిన్లపై క్లాప్ ఇచ్చారు. యంగ్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి కెమెరా స్విఛ్ ఆన్ చేశారు. లక్ష్మినారాయణ పుట్టంచెట్టి ఫస్ట్ షాట్ కు డైరెక్షన్ చేశారు.

READ ALSO: ICC T20 World Cup 2026: టీమిండియా సూపర్-8 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. ఏ రోజు ఏ జట్టుతో అంటే…?

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ.. నా స్నేహితుడు ప్రొడ్యూసర్ నరేంద్ర మరో మంచి చిత్రాన్ని చేస్తున్నారు. హీరో సత్యదేవ్ గారు ఒక ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆయనకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. డైరెక్టర్ లక్ష్మినారాయణకు కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుందన్నారు. అనంతరం డైరెక్టర్ లక్ష్మి నారాయణ పుట్టంచెట్టి మాట్లాడుతూ .. మా సినిమా జానర్ ఏంటి అని అందరూ అడుగుతున్నారు. అందరి పెదాలపై నవ్వుల పూయించే చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తున్నాం. రామ్ మిరియాల మా సినిమాకు మంచి మ్యూజిక్ అందిస్తున్నారు. ఫస్ట్ టైమ్ ఒక కంప్లీట్ మూవీకి ఆయన సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యదేవ్ గారి కెరీర్ లో ఇదొక పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా.

READ ALSO: IND vs NED: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. డచ్ జట్టుపై పరుగుల వేటకు ‘సూర్య’ సేన సిద్ధం!

Exit mobile version