NTV Telugu Site icon

Satyabhama: “క్యాలిక్యులేషన్స్ ఉండవు.. కేవలం ఎమోషన్స్ ఉంటాయి..” బాలయ్యపై కాజల్ కామెంట్స్..

Sathyabama

Sathyabama

హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. ఇక ఈ సినిమాలో నవీన్ చంద్ర ‘అమరేందర్’ అనే ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ‘అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లిలు’ నిర్మిస్తున్నారు. శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లేను అందించారు. ఈ చిత్రాన్ని ‘క్రైమ్ థ్రిల్లర్’ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. “సత్యభామ” సినిమాను జూన్ 7న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది.

Satyabhama Trailer: నటసింహం బాలయ్య చేతుల మీదుగా “సత్యభామ” ట్రైలర్ రిలీజ్..

ఈ సందర్బంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. సత్యభామ సినిమా ట్రైలర్ బాలకృష్ణ గారి చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. తాను లైఫ్ లో మరో ఫేజ్ లోకి అడుగుపెట్టిన టైంలో భగవంత్ కేసరి సినిమాలో నటించాను. అప్పుడు ఆయన ఇచ్చిన సపోర్ట్ తో నాకు ఎంతో కాన్ఫిడెన్స్ వచ్చిందని.. ఆయన లవ్ అన్ కండిషనల్, ఎనర్జీ అన్ మ్యాచబుల్, బాలకృష్ణ అన్ స్టాపబుల్ అంటూ పొగిడేసింది. అలాగే ఆయనకు ” క్యాలిక్యులేషన్స్ ఉండవు.. కేవలం ఎమోషన్స్ ఉంటాయి..” ఉంటాయి అంటూ మాట్లాడింది.

Balakrishna: ఎన్టి రామారావు వారసులు అంటే ఆయన గురించి చెప్పుకోవడం కాదు.. బాలయ్య హాట్ కామెంట్స్..

అలాగే అనిల్ రావిపూడి నాకు మంచి ఫ్రెండ్. సత్యభామ కథను శశి తన టీమ్ తో వచ్చి తనకి చెప్పారని., అది నాకు చాలా ఎమోషనల్ గా అనిపించిందని తెలిపింది. దాంతో నేను వెంటనే ఓకే చెప్పానని., ఈ కథ మీద ఉన్న నమ్మకం గ్లింప్స్ చూసినప్పుడు రెట్టింపు అయ్యిందని తెలిపింది. నా కో-స్టార్ నవీన్ చంద్రకు థ్యాంక్స్ చెబుతున్నా. అమర్ గా నవీన్ చంద్ర కంటే మరొకరు బాగా నటించలేరేమో అంటూ.. ఆయనతో మరోసారి కలిసి పనిచేయాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తో మరోసారి వర్క్ చేయడం హ్యాపీగా ఉందని., శశి వల్లే నేను సత్యభామగా మారనంటూ తెలిపింది. తెలుగు ఆడియెన్స్ నన్ను స్టార్ హీరోయిన్ ను చేశారు. ఇన్నేళ్లుగా నాకు మీ లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్స్. సత్యభామకు కూడా మీ లవ్ అందిస్తారని ఆశిస్తున్నట్లు ఆమె అన్నారు.

Show comments