Site icon NTV Telugu

Satya Kumar Yadav: జగన్ చెప్పినవన్నీ అబద్దాలే.. మంత్రి హాట్ కామెంట్స్.!

Satya Kumar Yadav

Satya Kumar Yadav

Satya Kumar Yadav: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. నేడు జరిగిన కర్నూలు బస్సు ప్రమాదంపై ఆయన స్పందిస్తూ.. ఘటన జరగడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అప్రమత్తం చేశారని తెలిపారు. కర్నూలు జీజీహెచ్ (ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి) సూపరింటెండెంట్‌ను కూడా అలెర్ట్ చేసినట్లు మంత్రి సత్యకుమార్ వివరించారు.

Minister Narayana: టిడ్కో ఇళ్లపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం.. అప్పటిలోపల 2.60 లక్షల ఇళ్ల పూర్తి..!

మరోవైపు, మంత్రి సత్యకుమార్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ గురువారం జరిగిన ప్రెస్ మీట్‌లో రెండు గంటల పాటు అన్నీ అబద్ధాలు చెప్పారని ఆయన ఆరోపించారు. నకిలీ మద్యం, డేటా సెంటర్, ఆరోగ్య వ్యవస్థ కుప్ప కూలింది వంటి అంశాలపై జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు. ఒక వ్యక్తికి అబద్ధాలు చెబుతున్నట్టు తెలియకుండానే.. పదే పదే అబద్ధాలు చెప్తున్నాడని మండి పడ్డారు. ప్రజల్ని తప్పుదారి పట్టించుకోవడం కోసం కొన్నిసార్లు అబద్ధాలు చెప్తారు. ఇవన్నీ మానసిక వ్యాధిలో భాగంగా చేస్తారు అంటూ మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Diwali Gift: దీపావళి గిఫ్ట్‌పై గొడవ.. యజమాని చేతిలో హత్యకు గురైన వ్యక్తి..

రాష్ట్రంలో అందరి ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానిదేనని, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా జగన్ ఆరోగ్యంపై కూడా బాధ్యత ఉందని మంత్రి అన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో జగన్ తప్పుడు లెక్కలు చెప్పారని ఆయన విమర్శించారు. ధర్నా చేస్తున్న నెట్‌వర్క్ ఆసుపత్రులు బకాయిలు రూ.2700 కోట్లు అని చెప్తుంటే, జగన్ మాత్రం రూ.4000 కోట్లు అని చెప్పారని అన్నారు. అలాగే గత ప్రభుత్వం నుంచి మాకు రూ.2500 కోట్లు అప్పు వారసత్వంగా వచ్చిందని.. ఈ 16 నెలల్లో ఆరోగ్యశ్రీకి రూ.5250 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇంకా రూ.2700 కోట్ల బకాయిలు ఉన్నాయి” అని మంత్రి సత్యకుమార్ వివరించారు. అలాగే, పీపీపీ మెడికల్ కాలేజీలపై కూడా జగన్ అబద్ధాలు మాట్లాడుతున్నారని, మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయకుండా ఆయనే సంక్షోభం సృష్టించారని మంత్రి ఆరోపించారు.

Exit mobile version