హైదరాబాద్ నార్సింగిలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. ‘కాలేజీ వేధింపుల వల్లే సాత్విక్ మృతి చెందాడు. బూతులు తిట్టడం, విద్యార్థుల ముందు కొట్టడం వల్ల మనస్తాపం చెందాడు. ఆచార్య, ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి తరచూ తిట్టేవారు. చనిపోయిన రోజు స్టడీ అవర్లో సాత్విక్ను వాళ్లిద్దరూ చితకబాదారు. హాస్టల్లోనూ సాత్విక్ను వార్డెన్ వేధించాడు’ అని పేర్కొన్నారు.
Also Read : Harish Rao : తెలంగాణా తరహా రైతు పథకాలపై ఇతర రాష్ట్రాల ఆసక్తి
చనిపోయే రోజు విద్యార్థి తల్లిదండ్రులు వచ్చివెళ్లారని.., వారి వెళ్లిన తర్వాత స్టడీ అవర్‌లో లెక్చరర్ ఆచార్య, ప్రిన్సిపల్ కృష్ణారెడ్డిలు సాత్విక్‌ను చితకబాదినట్లు తెలిపారు. అంతే కాకుండా సాత్విక్ ఇంట్లో వాళ్ళని బూతులు తిడుతూ ఆచార్య, కృష్ణారెడ్డి మాట్లాడినట్లు తెలిసింది.
Also Read : Bhadradri Temple : భద్రాద్రి ఆలయంలో సిబ్బంది నిర్లక్ష్యం.. ఇద్దరు అర్చకులకు మెమోలు
దీనికి తోడు సాత్విక్‌ను హాస్టల్ వార్డెన్ కూడా వేధింపులకు గురి చేసినట్లు గుర్తించారు. అలా కాలేజీ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేకనే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. మరోవైపు విద్యార్థి ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటర్ బోర్డు ఎంక్వైరీ కమిటీ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న కళాశాలలో అతనికి అడ్మిషన్ లేదని పేర్కొంది. ఒక కళాశాలలో అడ్మిషన్ తీసుకుని మరో కాలేజీలో తరగతులు నిర్వహిస్తున్నారని ఎంక్వైరీ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. అయితే అడ్మిషన్ సమయంలో నార్సింగి కళాశాల పేరుతోనే తమకు రశీదు ఇచ్చారని సాత్విక్ తల్లిదండ్రులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.