NTV Telugu Site icon

Election Agenda: ఇంటికో బైక్, రోజుకో ఫుల్ బాటిల్, రూ.20కే లీ.పెట్రోల్.. నాకే ఓటెయ్యండి?

Petrol

Petrol

Election Agenda: ఎన్నికలు ఏవైనా బరిలో గెలవాలన్నదే రాజకీయ నాయకుల లక్ష్యం. సాధ్యం అవుతాయా అన్న అంశం పక్కన పెడితే ఓటర్లను ఆకర్షించేందుకు చిత్రవిచిత్రమైన హామీలు ఇవ్వడం పరిపాటే. ఎదుటి వారు ఒకటిస్తానంటే నేను రెండిస్తానంటూ వరాలు కురిపిస్తారు. ఎంపీ నుంచి వార్డ్ మెంబర్ వరకూ తన పరిధి ఎంతవరకు అనే విషయం పట్టించుకోకుండా పోటీలో గెలవడమే వారికి కావాల్సింది.. ఆ కోవలోనే ఓ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల సందర్భంగా ఓటర్ల కోసం ప్రకటించిన మేనిఫెస్టో వింటే ముక్కున వేలేసుకుంటారు.

హర్యానాలోని సిర్సద్​చెందిన జైకరణ్​తన ఎన్నికల మేనిఫెస్టోని ఓ పోస్టర్​రూపంలో ప్రచురించాడు. అందులో తాను సర్పంచ్​గా గెలిస్తే తర్వాత గ్రామంలో మూడు విమానాశ్రయాలు నిర్మిస్తామని, మహిళలకు మేకప్‌ కిట్‌ ఉచితంగా ఇస్తామని, సిర్సాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.20కి, ఒక్కొక్కరికి ఒక్కో బైక్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి రోజుకు ఒక బాటిల్ మద్యం ఇస్తానన్నారు. సిర్సాద్ నుంచి గోహనా వరకు ప్రతి 5 నిమిషాలకు హెలికాప్టర్ సౌకర్యం అందుబాటులో తీసుకువస్తానన్నారు. జీఎస్టీ రద్దు చేసి, గ్యాస్ ధర సిలిండర్‌కు రూ.100, సిర్సాద్ నుంచి ఢిల్లీ వరకు మెట్రో లైన్, ఉచిత వైఫై సౌకర్యం, యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే దీన్ని చాలామంది ఫన్నీగా తీసుకుని షేర్​ చేసుకుంటుండడంతో వైరల్​గా మారింది.

Read Also: Seva Vikas Co-op Bank: దేశంలో మరో బ్యాంక్ కథ కంచికి.. ‘కో ఆపరేటివ్’గా లేదని లైసెన్స్ రద్దు

ఆ పోస్టర్ ఐపీఎస్ ఆఫీసర్ అరుణ్ బోత్రా దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. పోస్టర్‌కు సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘నేను ఆ గ్రామానికి షిఫ్ట్ అవుతున్నా’ అని ఫన్నీగా పేర్కొన్నాడు. దీంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.