టాలీవుడ్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు రీసెంట్ గా సర్కారు నౌకరి మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సర్కారు నౌకరి మూవీ ఈ ఏడాది జనవరి 1న థియేటర్లలో విడుదల అయింది.సోషల్ మెసేజ్‌కు కమర్షియల్ హంగులను మేళవించి తెరకెక్కిన ఈ మూవీ కి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించాడు. సర్కారు నౌకరి సినిమాను ఆర్‌కే టెలిషో పతాకంపై సీనియర్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు ప్రొడ్యూస్ చేశారు.. ఈ సినిమాతో భావన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాకు శాండిల్య బొబ్బిలి మరియు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. గతంలో శేఖర్ గంగనమోని పంచతంత్ర కథలు పేరుతో ఓ సినిమా ను చేశాడు.ఇదిలా ఉంటే సర్కారు నౌకరి మూవీ థియేటర్లలో విడుదలైన ఇరవై ఐదు రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నది. సర్కారు నౌకరి సినిమాను జనవరి 26 న ఓటీటీ ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. థియేటర్ రిజల్ట్ కారణంగానే సర్కారు నౌకరి సినిమా తొందరగా ఓటీటీలోకి వచ్చేస్తోన్నట్లు తెలుస్తోంది.సర్కారు నౌకరి సినిమాలో గోపాల్ పాత్ర లో ఆకాష్ గోపరాజు యాక్టింగ్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఎయిడ్స్ వ్యాధి పై అవగాహన కల్పించే ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటాడు గోపాల్. కండోమ్‌లు పంచే ఉద్యోగం చేస్తున్న అతడికి సొసైటీ నుంచి ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి.. అతడిని ఓ అంటరానివాడిగా ఎందుకు చూశారు..ప్రేమించి పెళ్లి చేసుకున్న సత్య (భావన) కూడా గోపాల్ చేస్తోన్న ఉద్యోగం నచ్చక అతడికి ఎందుకు దూరమైంది.. ఎయిడ్స్ వ్యాధి పై అవగాహన కల్పించే ఉద్యోగమే గోపాల్ చేయడానికి అస్సలు కారణం ఏమిటి.. అస్సలు అతడి గతం ఏమిటీ అనేదే సర్కారు నౌకరి మూవీ కథ. అయితే ఈ చిత్ర కథ బాగున్నా కానీ కమర్షియల్ గా మాత్రం ఆశించిన స్థాయి లో విజయాన్ని సాధించలేకపోయింది