Site icon NTV Telugu

Saripodhaa Sanivaaram :సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్ అప్డేట్ వైరల్..

Nani

Nani

Saripodhaa Sanivaaram :న్యాచురల్ స్టార్ నాని గత ఏడాది “హాయ్ నాన్న” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.ప్రస్తుతం నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ “సరిపోదా శనివారం “..ఈ సినిమాను వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నాడు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “అంటే సుందరానికి !” సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.దీనితో దర్శకుడు వివేక్ ఆత్రేయ నాని పక్క యాక్షన్ ఫిలిం గా తెరకెక్కిస్తున్నారు.

Read Also :Raviteja 75 : మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్ అప్డేట్..

ఈ సినిమాను డివివి ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.గ్యాంగ్ లీడర్ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా మూవీ ఇదే కావడం విశేషం.ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు.తాజాగా ఈ మూవీ యూనిట్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది.మీ విజ్ఞప్తులు వినపడ్డాయి .సరిపోదా శనివారం మ్యూజికల్ హీట్ వేవ్ షురూ అంటూ ఫస్ట్ సింగల్ అప్డేట్ అందించారు.ఈ మూవీ నుంచి తొలి సాంగ్ అప్డేట్ ను ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు షేర్ చేయనున్నట్లు ప్రకటించారు.ప్రస్తుతం ఈ అప్డేట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Exit mobile version